
సీఎం పర్యటన మళ్లీ వాయిదా
చండ్రుగొండ: సీఎం రేవంత్‌రెడ్డి చండ్రుగొండ మండల పర్యటన మళ్లీ వాయిదా పడింది. తుపాను ప్రభావానికి తోడు ఈనెల 30నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం వెల్లడించారు. ఈనెల 21న చండ్రుగొండ మండలం బెండాలపాడులో సీఎం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభిస్తారని మొదట ప్రకటించారు. ఈ పర్యటన వాయిదా పడగానే సీఎం 30న దామరచర్లలో పర్యటిస్తారని తెలిపారు. హెలీప్యాడ్, సభాస్థలి పనులు జరుగుతుండగానే పర్యటన వాయిదా పడినట్లు వెల్లడించారు. అయితే, సెప్టెంబర్‌లో సీఎం పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
మరోవైపు చివరి దశకు చేరిన ఏర్పాట్లు