
ఉద్యమాలకు సిద్ధం కావాలి
బూర్గంపాడు: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమా అంజిరెడ్డి డిమాండ్ చేశారు. సారపాకలో శనివారం జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలిదశ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, హెల్త్‌కార్డులు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. హామీలు అమలు కాకుంటే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమకారుల పిల్లలకు ఉచితంగా ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని, తమపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని అన్నారు. సమావేశంలో మలిదశ ఉద్యమకారులు తోడేటి సత్యనారాయణ, పొడియం నరేందర్, బాగి వెంకట్రావు, సోమయ్య, పేరాల శ్రీనివాసరావు, నల్లమోతు సురేష్, దాసరి సాంబయ్య, గుర్రాల సుదర్శన్, కొండగట్టు ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు.