
నానో యూరియాతో మెరుగైన ఫలితాలు
ఇల్లెందురూరల్: నానో యూరియా వినియోగంతో రైతులకు మెరుగైన ఫలితాలు అందుతాయని ఏడీఏ లాల్‌చంద్ అన్నారు. మండలంలోని మాణిక్యారం, కొమరారం గ్రామపంచాయతీల్లో నానో యూరి యా వినియోగం, పిచికారీ పద్ధతిపై రైతులకు శని వారం క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. నానో వినియోగం వల్ల రైతుకు పెట్టుబడి భారం తగ్గడంతోపాటు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. గుళికల రూపంలో ఉండే యూరియా కంటే ద్రవరూపంలో ఉన్న నానో యూరియా వినియోగంపై ఎంతో మేలని, దీనిపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సతీష్, పలువురు రైతులు పాల్గొన్నారు.