
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
ఇల్లెందు: ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో గత ఐదు నెలలుగా పెండింగ్ ఉన్న అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం కోర్టును ఆయన సందర్శించగా.. స్థానిక న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రికరెడ్డి మొక్క అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన శాలు వతో సత్కరించారు. అనంతరం న్యాయమూర్తి కోర్డులో రికార్డులను తనిఖీ చేశారు. కాగా, కోర్టులో శౌచాలయాలు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన వినతి పత్రం అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్ న్యాయవాదులు దంతాల ఆనంద్, పెద్దూరి నర్సయ్య, గోపీనాథ్, నారాయణ, బా లకృష్ణ, వెంకటేశ్వర్లు, రవికుమార్, ఎస్.సత్యనారాయణ, బన్సీలాల్ తదితరులు ఉన్నారు.
ఫ్యాక్టరీకి ‘గెలల’ తాకిడి..
దమ్మపేట: మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి శనివారం ట్రాక్టర్లు బారులుదీరాయి. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒక్కసారిగా ఫ్యాక్టరీకి చేరుకోగా.. ప్లాట్‌ఫాం అంతా గెలలతో నిండిపోయింది. ఈ క్రమంలో గెలలను ప్లాట్‌ఫాం కింద ఉన్న మరో డంపింగ్ కన్వేయర్ బెల్ట్ వద్ద దిగుమతి చేస్తున్నారు. ఫ్యాక్టరీకి గెలల తాకిడి పెరగడంతో దిగుమతికి గంటల సమయం పడుతుందని రైతులు చెబు న్నారు. దీనిపై ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్‌ను వివరణ కోరగా.. ఇటీవల కురిసిన వర్షాలతో గెలల కోత ఆపిన రైతులు.. వర్షం తగ్గడంతో గెలల కోత ప్రారంభించడంతో ఫ్యాక్టరీకి తాకిడి పెరిగిందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా క్రమ పద్ధతిలో దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు.
నీటిని త్వరగా ఎత్తిపోయాలి
మణుగూరు టౌన్: బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న వర్షపు నీటిని ఉపరితల గనుల నుంచి త్వరితగతిన ఎత్తిపోయాలని డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన తొలుత పగిడేరు జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శించారు. 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్‌ాధ్యన్ని పెంపునకు అవకాశాలు పరిశీలించాలని సంబంధిత అధికారులతో సమాలోచన చేశారు. అనంతరం పీకేఓసీ–4ను సందర్శించి మాట్లాడారు. సమష్టి కృషితో ఉత్పత్తి సాధనకు పనిగంటలు పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రాంచందర్, జీఎం(ఆర్‌అండ్‌డీ) కనకయ్య, జీఎం(ఎక్స్‌ప్లోరేషన్) శ్రీనివాస్, డీజీఎం(ఎక్స్‌ప్లోరేషన్) రాజ్‌కుమార్, డీజీఎం(ఆర్‌అండ్‌డీ) శ్రీనివాస్, అధికారులు శ్రీనివాసచారి, దయాకర్, బైరెడ్డి వెంకటేశ్వర్లు, సేఫ్టీ అధికారి భాస్కర్, శ్రీనివాస్, ఎస్టేట్స్ బాబుల్ రాజ్, ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి ఎగుమతుల్లో
నకిలీ దందా
ఖమ్మంవ్యవసాయం/ఖమ్మం క్రైం: పత్తి ఎగుమతుల్లో ఖమ్మం వ్యవసాయ మా ర్కెట్ పరిధిలోని ఓ వ్యాపారి చేసిన నకిలీ దందా బయటపడింది. దీంతో ఆయనపై మార్కెట్ బాధ్యులు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు... పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇత ర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులు మా ర్కెట్ నుంచి పర్మిట్లు పొందాలి. ఆ పర్మిట్ల ఆధారంగా ఎగుమతి చేస్తూ నిర్ణీత రుసుము మార్కెట్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 2023లో ఖమ్మంకు చెందిన మహాలక్ష్మి కాటన్ ట్రేడర్స్ యజమాని మన్నెం కృష్ణయ్యకు మా ర్కెట్ నుంచి రశీదు పుస్తకం జారీ చేశారు. ఇందులోని ఓచర్ల ద్వారా పత్తిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేశా డు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ కంపెనీకి కూడా 1,100 క్వింటాళ్ల పత్తిని ఎగుమతి చేయగా, వారు అనుమానం వచ్చి ఆరా తీయడంతో నకిలీ పర్మిట్‌గా తేలింది. ఇదికాక పలు ఓచర్లతో నకిలీ పర్మిట్ సృష్టించినట్లు తేలడంతో కృష్ణయ్యపై మార్కెట్ కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు. ఈ పర్మిట్ల ఆధారంగా సదరు వ్యాపారి మార్కెట్‌కు రూ.1.50 లక్షల పన్ను చెల్లించాల్సి ఉన్నట్లు తేలగా.. మొత్తం ఎగుమతులను పరిశీలిస్తే ఇది పెరిగే అవకాశముందని సమాచారం. కాగా, చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యాన ఈ విషయం బయటపడడం గమనార్హం.

పెండింగ్ పనులు పూర్తిచేయాలి

పెండింగ్ పనులు పూర్తిచేయాలి