
వాగు దాటి.. వైద్యం అందించి..
ములకలపల్లి: స్థానిక మంగపేట పీహెచ్‌సీ వైద్య బృందం వాగులు, వంకలు దాటి వలస గొత్తికోయలకు వైద్య సేవలు అందించారు. తిమ్మంపేట సబ్‌సెంటర్ పరిధిలోని మారుమూల వలస ఆదివాసీ గ్రామాలైన పాలవాగు, కొత్తగుండాలపాడు, పాత గుండాలపాడు, పాలవాగుల్లో స్థానిక వైద్యాధికారి కృష్ణదీపక్‌రెడ్డి ఆధ్వర్యాన శనివారం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రెండు కి.మీ కాలిబాటన వెళ్లి 90 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 12 మంది జ్వరపీడితులను గుర్తించి మందులు అందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారి తెలిపారు. సబ్‌యూనిట్ ఆఫీసర్ జేతూరామ్, ఎంటీఎస్ చైతన్య, హెచ్‌ఎస్‌లు శ్రీకృష్ణ, నాగమణి, ఎంఎల్‌హెచ్‌పీ స్పందన తదితరులు పాల్గొన్నారు.

వాగు దాటి.. వైద్యం అందించి..