
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మణుగూరు టౌన్: మున్సి పాలిటీ పరిధి రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే మహిళ విద్యుదాఘాతంతో శనివా రం మృతిచెందింది. మధ్యా హ్న భోజన ప్రైవేట్ వర్కర్‌గా పనిచేసే భూక్య గౌరీ (56) రోజు మాదిరిగానే మోటార్ స్విచ్ వేస్తుండగా.. విద్యుత్ ప్రసరించి షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో స్థానికులు ఆటోలో 100 పడకల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, గౌరి కుటుంబానికి న్యా యం చేయాలనే డిమాండ్‌తో సీఐటీయూ నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేశ్, యూని యన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ తదితరులు ఎంఈఓ, ఎంపీడీఓలతో చర్చించగా.. మృతురాలి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడమే కాక హెచ్‌ఎం రూ.లక్ష పరిహారం ఇప్పించారు. నాయకులు బ్రహ్మచారి, గద్దల శ్రీను, ఉప్పుతల నర్సింహారావు, సత్రపల్లి సాంబశివరావు, కాంతారావు, శైలజ, సారిక, పద్మ, భేగం పాల్గొన్నారు.
ఆటోలో నుంచి జారిపడి మహిళ..
పాల్వంచరూరల్: ప్రమాదవ శాత్తు ఆటోలో నుంచి జారి పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని జగన్నాథపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యనగండ్ల హరీష్ భార్య సునీత(29) శుక్రవారం పాల్వంచ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తోంది. ఈక్రమంలో జగన్నాథపురం గ్రామంలో మూలములుపు వద్ద ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారిపడగా.. తీవ్రగాయాలు కావడంతో అదే ఆటోలో కొత్తగూడెంకు తరలించారు. పరీక్షించిన వైద్యులు వరంగల్‌కు రిఫర్ చేయగా.. మార్గం మధ్యలో మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ శనివారం మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి