
నాటు సారా స్వాధీనం
టేకులపల్లి: అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్న నాటు సారాను జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం స్వాధీనం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసింది. టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ గౌతమ్ కథనం ప్రకారం.. జిల్లా ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం మండలంలోని సుక్కాల బోడు, రేగుల తండ, టేకులపల్లి, బొమ్మనపల్లి, సూర్యతండా, చంద్రుతండా గ్రామాల్లో అనుమానిత స్థావరాలు, నివాసాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని ధారావత్ నాగరాజు, గుగ్గిల రవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నాటు సారా తయారు చేయడం, విక్రయించడం నేరమని, ఎవరైనా విక్రయాలు జరిపితే ఎకై ్సజ్ కానీ పోలీసు శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ దాడుల్లో సిబ్బంది రామక్రిష్ణ గౌడ్, వెంకట నారాయణ, సుమంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో గల ఏఎంసీ మార్కెట్‌లో గుర్తు తెలి య ని మృతదేహం లభ్యమైంది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల రోడ్డులో గల కొత్త మార్కెట్‌లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తుతెలి యని వ్యక్తి ఏఎంసీ మార్కెట్ పరిధిలో గల దుకాణాల వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యాన శనివారం మధ్యాహ్నం మా ర్కెట్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు శవాన్ని పరిశీలించి మృతుడి ఒంటిపై నల్లని నిక్కర్, గల్లతో కూడిన తెల్ల ని షర్ట్ ఉన్నట్లు తెలిపారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశా రు. ఆచూకీ తెలిస్తే భద్రాచలం టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.