
రైతులను ఆదుకోవాలి..
బూర్గంపాడు: గోదావరి వరదలకు పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం బూర్గంపాడు మండలంలోని రెడ్డిపాలెంలో గోదావరి వరదల కు దెబ్బతిన్న పంటచేలను సీపీఎంప్రతినిధి బృం దం పరిశీలించి పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పత్తి చేలు వరదకు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటనష్టంపై నివేదికలను ప్రభుత్వానికి పంపించాలని పంటనష్టపరి హారం అందేలా చేడాలన్నారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, బయ్యా రాము, గుంటక కృష్ణ, ఎస్‌కె.అబీదా, కనకం వెంకటేశ్వర్లు, కొమర్రాజు సత్యనారాయణ, కమటం మరి యమ్మ తదితరులు పాల్గొన్నారు.