
నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి
మణుగూరు టౌన్: ఏరియాలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ నాణ్యతతో కూడిన బొగ్గును ఉత్పత్తి చేసేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంస్థ లక్ష్యాలను ఏరియా ప్రగతిని వివరించారు. ప్రస్తుత కంపెనీ ముందున్న సవాళ్లను, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో పాటు సంస్థలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మిపతిగౌడ్, శ్రీనివాసచారి, రమేశ్, శ్రీనివాస్, అనురాధ, బాబుల్ రాజు తదితరులు ఉన్నారు.