
చిరు వ్యాపారులను ఆర్థిక బలోపేతం చేయాలి
అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని చిరు, వీధి వ్యాపారులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కమిషనర్ బి.నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మెప్మా రిసోర్స్ పర్సన్ సభ్యులు, చిరు వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను చైతన్య పరిచి ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వీధి వ్యాపారులను గుర్తించి వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒకొక్క సభ్యుడికి రూ.10వేల రూపాయాలను అందించి వ్యాపారం నిర్వహించుకునేందుకు ప్రోత్సహిస్తామన్నారు. అదే విధంగా మున్సిపాలిటీను క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచడంలో సమిష్టిగా కృషి చే ద్దామని కోరారు. కోతులు, కుక్కల సమస్యను నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ పింగళి నాగరాజు రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.