
మహాధర్నాను జయప్రదం చేయండి
దమ్మపేట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాకు ఉద్యోగ, ఉపాధ్యాయు లు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ కోరా రు. మండలంలోని నాగుపల్లి పాఠశాలలో శుక్రవా రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పీఆర్‌టీ యూ పోరాడుతోందని తెలిపారు. సీపీఎస్ రద్దుతో పాటు పెండింగ్ బిల్లుల మంజూరు, డీఏ, పీఆర్‌సీ విడుదల ఇతర సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, జిల్లా, మండల అధ్యక్ష, కార్యదర్శులు టి.నరసయ్య, ప్రభాకర్, పీఎస్‌ఎస్.ప్రసాద్, ఎ.వెంకటేశ్వ ర్లు, నాయకులు బండి శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బజ్జూరి సరళ, జనార్దన్, మస్తాన్‌అలీ, నాగాచారి తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్