
జ్వరంతో బాలుడు మృతి
అశ్వాపురం: మండలంలోని ఎలకలగూడెం గ్రామానికి చెందిన సవలం రవికుమార్(7) జ్వరంతో బాధపడుతూ గురువారం మృతి చెందాడు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రవిని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా పరిస్థితి మెరుగుపడక భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో పోస్టుమ్యాన్ మృతి
టేకులపల్లి: మండలంలోని మాలపల్లికి చెందిన పోస్ట్‌మ్యాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మండలంలోని కొత్తతండా(పీ) పంచాయతీ పరిధి మాలపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి జానకీరామ్(58) ప్రెగళ్లపాడు పోస్టాఫీసు పరిధిలో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈమేరకు బుధవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జానకీరామ్‌ను హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ద్విచక్ర వాహనదారుడిపై కేసు నమోదు
పాల్వంచరూరల్ : వ్యక్తిని ఢీకొట్టి గాయపరిచిన ఘటనలో ద్విచక్రవాహనదారుడిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని నర్సమ్మగుడి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న సుజాతనగర్‌కు చెందిన బోడ సక్రును రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన మడకం శ్రీను తన బైక్‌తో ఢీ కొట్టగా సక్రు గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.