●మునిగిన పంటలు.. నిలిచిన రాకపోకలు | - | Sakshi
Sakshi News home page

●మునిగిన పంటలు.. నిలిచిన రాకపోకలు

Aug 21 2025 6:50 AM | Updated on Aug 21 2025 6:50 AM

●ముని

●మునిగిన పంటలు.. నిలిచిన రాకపోకలు

గోదావరి నదికి భారీగా వస్తున్న వరదతో పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. రహదారులపైకి నీరు చేరి ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాలిపేరు బ్యాక్‌వాటర్‌తో దండుపేట – కొత్తపల్లి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి – ఆమెర్ద గ్రామాల నడుమ కూడా రవాణా స్తంభించింది. ఆయా గ్రామాల్లో వరి, పత్తి పంటలు మునిగిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి తదితర గ్రామాల్లోనూ రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. – చర్ల/దుమ్ముగూడెం/అశ్వాపురం

దుమ్ముగూడెం : పర్ణశాల వద్ధ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

దుమ్ముగూడెం : సున్నంబట్టి – బైరాగులపాడు రహదారిపైకి చేరిన వరద

●మునిగిన పంటలు.. నిలిచిన రాకపోకలు1
1/1

●మునిగిన పంటలు.. నిలిచిన రాకపోకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement