భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 419 సీట్లు భర్తీ అయ్యాయని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో ఐదు నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా బాలికలు 121 మంది, బారులు 298 మంది చేరారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని పలు గురుకులాల ప్రిన్సిపాళ్లు రమాదేవి, రాణి, చైతన్య, మాధవీలత, శిరీష, మాధవి, వీరస్వామి, సురేశ్, శ్యాంకుమార్, హరికృష్ణ, భాస్కర్ పాల్గొన్నారు.
యూరియా సరఫరాలో విఫలం
ఇల్లెందు: ప్రభుత్వం యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. బుధవారం ఇల్లెందులో దిండిగాల రాజేందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తు న్నారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, 20 నెలల కాంగ్రెస్ పాలనను రైతులు పోల్చి చూసుకోవాలన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నేతలు దిండిగాల రాజేందర్, ఎస్.రంగనాథ్, భావ్‌సింగ్‌నాయక్, పోషం, వరప్రసాద్, చీమ ల సత్యనారాయణ, అబ్దుల్ నబీ, ఘాజీ, జబ్బార్ తదితరులు ఉన్నారు.
కొబ్బరితోటల పెంపకంపై శిక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొబ్బరి తోటల పెంపకం,యాజమాన్య పద్ధతులపై కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యాన రైతులకు శిక్షణ ఇచ్చారు. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడు లోని ఉద్యాననర్సరీలో బుధవారం ఏర్పాటు చేసి న శిక్షణకు కోకోనట్ బోర్డు డీడీ మంజునాథ్‌రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఉద్యాన అధికారులు మధుసూదన్, జంగా కిశోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు అమలు చేస్తున్న పథకాలు, సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను అధికారులకు అందజేయాలని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వ్యక్తి
దశ లవారీగారూ.1,17,946 కోల్పోయిన బాధితుడు
చండ్రుగొండ: మండల కేంద్రం శివారు ఇమ్మడి రామయ్యబంజర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ వలలో పడి ఆర్థికంగా నష్టపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇమ్మడి రామయ్యబంజర్‌కు చెందిన వీరబోయిన మురళీకి ఇటీవల ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. రూ.లక్ష లోన్ మంజూరైందని, అందుకు గాను బ్యాంక్ పాస్‌బుక్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలు వాట్సప్ చేయాలని చెప్పడంతో అలాగే చేశాడు. రూ.2 వేలు మొదలుకుని దశలవారీగా రూ.1,17,946 నగదు ఫోన్‌పే చేశాడు. తర్వాత అతడి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మురళి సైబర్ క్రైం అధికారులను ఆశ్రయించాడు. స్థానిక ఎస్‌ఐ శివరామకృష్ణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.