
ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు
జూలూరుపాడు: టీబీ అనుమానితులకు ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు స్థానిక పీహెచ్‌సీలో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశాల మేరకు వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీటీసీఓ డాక్టర్ పుల్లారెడ్డి పర్యవేక్షణలో ప్రధాన మంత్రి టీబీ(క్షయవ్యాధి) ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ రోగులను గుర్తించేందుకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్యాంప్ ఈనెల 30వ తేదీవరకు పీహెచ్‌సీ పరిధి లోని అన్నారుపాడు, పాపకొల్లు, భేతాళపాడు, కొమ్ముగూడెం, పడమటనర్సాపురం, కాకర్ల, అనంతారం, గుండెపుడి హెల్త్ సబ్ సెంటర్లలో కొనసాగనుండగా.. టీబీ అనుమానితులకు ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేస్తారు. కాగా, వైద్య పరీక్షలను పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు ప్రారంభించి, వివరాలు వెల్లడించారు. తొలి రోజు 50 మందికి ఎక్స్ రే తీయగా 16 మందిని టీబీ అనుమానితులుగా గుర్తించామని వివ రించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ ఎం.రామకృష్ణ, హెచ్‌ఎస్ రత్నకుమార్, టీబీ సూపర్‌వైజర్ రఫేల్, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ, ఎక్స్‌రే నిపుణులు సాయికృష్ణ, ఎంఎల్‌హెచ్‌పీ అమూల్య, ఐసీటీసీ ఎల్‌టీ బి.రాహుల్, సిబ్బంది శరత్ తదితరులు పాల్గొన్నారు.