అక్కడ తక్కువ ధరకే లభిస్తున్న నాణ్యమైన బొగ్గు అటువైపే మొగ్గు చూపుతున్న దక్షిణాది పరిశ్రమలు సింగరేణిలో ఉత్పాదక, ఇతర వ్యయాలు అధికం అయినా కనిపించని దిద్దుబాటు చర్యలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరతో కోలిండియా, నాణ్యతతో విదేశీ బొగ్గు సింగరేణికి సవాల్ విసురుతున్నాయి. ఉత్పాదక వ్యయం తగ్గించుకోకుంటే సంస్థకు రాబోయే రోజుల్లో ముళ్లబాటేనని స్పష్టంగా తెలుస్తున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో సింగరేణి నుంచి సరైన స్పందన కనిపించడం లేదంటున్నాయి ఆ సంస్థకు సంబంధించిన గణాంకాలు.
చేజారుతున్న మార్కెట్
దక్షిణ భారత దేశంతో పాటు మహారాష్ట్ర, ఒడిశా వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న భారీ పరిశ్రమలకు నిన్నామొన్నటి వరకు సింగరేణి బొగ్గే ప్రధానం. ఈ బొగ్గును ఉపయోగిస్తున్న పరిశ్రమల్లో సింహభాగం థర్మల్ విద్యుత్ కేంద్రాలది కాగా, ఆ తర్వాత సిమెంట్, ఐరన్ వంటి ఇతర భారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సింగరేణికి కోలిండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌ల నుంచి సవాల్ ఎదురవుతోంది. ప్రస్తుతం జీ 13 గ్రేడ్ టన్ను బొగ్గును సింగరేణి సంస్థ థర్మల్ పవర్ పరిశ్రమలకు రూ.4000కు విక్రయిస్తుండగా ఇతర పరిశ్రమలకు రూ. 5000కు అమ్ముతోంది. ఇదే గ్రేడ్ బొగ్గును వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ వారు థర్మల్‌కు రూ.2,200, ఇతర పరిశ్రమలకు రూ. 2,600కు మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చారు. కోలిండియా అయితే మరీ తక్కువగా థర్మల్‌కు రూ.1,600 , ఇతరులకు రూ.1,900కు అమ్మేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటికే సిమెంట్ తదితర భారీ పరిశ్రమలు కోలిండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ వైపు మొగ్గు చూపుతుండగా థర్మల్ పవర్‌లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) సైతం అదే దారిలో వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. అధిక రేటు కారణంగా ఒక్కో సంస్థ సింగరేణికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తప్పని అధిక వ్యయం..
సింగరేణి సంస్థ బొగ్గు వెలికి తీసే గోదావరి – ప్రాణహిత లోయ పరిధిలో నెలకొన్న పరిస్థితుల వల్ల సహజంగానే ఇక్కడ బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఓపెన్‌కాస్టు గనుల్లో టన్ను బొగ్గు వెలికి తీయాలంటే ఎనిమిది టన్నుల మట్టిని తీయాల్సి వస్తోంది. అదే కోలిండియా పరిధిలో అయితే టన్ను బొగ్గుకు గరిష్టంగా మూడు టన్నుల మట్టి తీస్తే సరిపోతుంది. దీంతో కోలిండియాలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటోంది. నిన్నా మొన్నటి వరకు రైలు మార్గంలో రవాణాకు అధిక చార్జీలు ఉండడంతో కోలిండియా నుంచి బొగ్గు తీసుకునేందుకు దక్షిణాది పరిశ్రమలు వెనకడుగు వేసేవి. కానీ రవాణా సౌకర్యాలు మెరుగుపడుతుండగా ఇప్పుడా ఇబ్బంది పోయింది. దీంతో సింగరేణి నుంచి అధిక ధరకు కొనడం కంటే తక్కువ ధరకు వచ్చే కోలిండియా బొగ్గు వైపు దక్షిణాది పరిశ్రమలు చూస్తున్నాయి.
సింగరేణికి సవాల్ విసురుతున్న కోలిండియా
మస్టర్లు 2022 2023 2024
0 221 183 263
0 - 100 791 960 1,127
101-140 436 448 377
140 -190 688 545 369
ముందున్నది ముళ్లబాటే!