
‘రైతు నేస్తం’ను సద్వినియోగం చేసుకోవాలి
మణుగూరు రూరల్ : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అందిస్తున్న సలహాలు, సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు అన్నారు. మండలంలోని గుట్టమల్లారం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు నేస్తం ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట సాగులో పాటించాల్సిన పద్ధతులను వివరిస్తారని, వారి సలహాలు, సూచనలతో పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఓలు రాహుల్‌రెడ్డి, చటర్జీ, హెచ్‌ఓ సాయికృష్ణ, ఏఈఓలు కొమరం లక్ష్మణ్‌రావు, హారిక తదితరులు పాల్గొన్నారు.
పంటల పరిశీలన..
మండలంలోని తిర్లాపురం గ్రామపంచాయతీలో రైతులు సాగు చేస్తున్న వరి, పత్తి, కూరగాయ పంటలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, మణుగూరు ఏడీఏ బి.తాతారావు మంగళవారం పరిశీలించారు. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, సాగులో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ భరత్, హెచ్‌ఓ శివ, హరిశ్చంద్ర పాల్గొన్నారు.
డీఏఓ బాబూరావు