
పంటను ధ్వంసం చేసిన అటవీ అధికారులు
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి కూనారం గ్రామ సమీపంలో కొందరు రైతులు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటను అటవీ అధికారులు ధ్వంసం చేశారు. ఇవి అటవీ భూములని చెబుతున్న అధికారులు.. రెండు రోజులుగా పంటను నరికేస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ భూములు అటవీ శాఖ పరిధిలో ఉండడంతో పాటు ఇక్కడి రైతులు, అటవీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా రైతులు, అటవీ అధికారులు ఆ భూముల్లోకి వెళ్లొద్దని, ఎలాంటి పనులు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు రైతులు ఎలా వ్యవసాయం చేస్తారని అంటూ అటవీ అధికారులు మొక్కజొన్న పంటను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావును వివరణ కోరగా కోర్టు పరిధిలో ఉన్నందున ఆ భూముల్లో ఎవరూ ఎలాంటి పనులు చేపట్టవద్దని, ఆ భూములు పూర్తిగా అటవీ శాఖ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు.