మణుగూరురూరల్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో బీఆర్‌ఎస్ అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.
ఎద్దు ప్రాణాలు కాపాడిన సేవా సంస్థ బాధ్యులు
కొత్తగూడెంఅర్బన్: సెప్టిక్ ట్యాంక్‌లో పడి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఎద్దును మదర్ థెరిస్సా సేవా సంస్థ సభ్యులు మంగళవారం కాపాడారు. రుద్రంపూర్ ఏరియాలోని సెప్టిక్ ట్యాంకు లో ఎద్దు పడిన సమాచారం కార్పెంటర్ మంద నాగేశ్వరరావు, ఎండీ షబ్బీర్ తెలియడంతో వారు మదర్ థెరిస్సా సేవా సంస్థ సభ్యులు శ్రీనివాస్, సీహెచ్ రాములుకు తెలిపారు. వారు మరికొందరితో కలిసి ట్యాంక్‌లో పడిన ఎద్దును పైకి లాగి కాపాడారు.
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత?
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో రెండు వేర్వేరు ఘటనల్లో సీసీఎస్ పోలీసులు, ఖమ్మం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం భారీగా గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లోని చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ లారీని ఆపి తనిఖీ చేయగా.. అందులో 7 బస్తాల్లోని 3 క్వింటాళ్ల గంజాయి దొరికిందని తెలిసింది. లారీ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్‌తో ఉండగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మరో ఘటనలో కూడా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గంజాయి పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పాల్వంచ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం మొర్రేడు వాగు నుంచి ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దమ్మపేట సెంటర్ వద్ద మాటు వేసి మూడు ట్రాక్టర్లను పట్టుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.

కేటీఆర్‌ను కలిసిన రేగా