
● కిన్నెరసాని నుంచి 8 వేల క్యూసెక్కులు..
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయంలోకి వరద ఉధృతి పెరిగింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా, 2,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, సోమవారం నీటిమట్టం 404.90 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి ఉంచి 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తుననట్లు డ్యామ్‌సైడ్ ఏఈ తెలిపారు. భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుండగా, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో రైతులు, ప్రజలు వాగుల సమీపంలోకి వెళ్లొద్దని, నిర్లక్ష్యంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు సూచించారు. నదీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.