
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. నిత్య కల్యాణ వేడుకలో జంటలు అధిక పాల్గొని, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వరుస సెలవులు రావడంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిలాడాయి. పుణ్య స్నానాలు ఆచరించే భక్తులతో పాటు పెరుగుతున్న గోదావరిని తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గోదావరి తీరంలో సందడి వాతావరణం నెలకొంది.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన