
‘ప్రజాయోధుడు’ పుస్తకావిష్కరణ
ఇల్లెందు : గత పదేళ్ల కేసీఆర్ పాలనపై ఇల్లెందు సంజయ్‌నగర్‌కు చెందిన తోటకూర మహేందర్ ‘ప్రజాయోధుడు’ శీర్షికన 220 పేజీల పుస్తకాన్ని రచించగా.. హైదరాబాద్‌లో శనివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. మహేందర్ ఉన్నత చదువు పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటూ గ్రూప్ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎలా ఉండేది, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎలా అభివృద్ధి సాధించిందనే వివరాలను సోదాహరణంగా పుస్తకంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణను ఎలా వక్రీకరిస్తున్నారనే అంశాలను వివరంగా వెల్లడించారు. ఈ పుస్తకంలో కేసీఆర్ జననం, బాల్యం, రాజకీయ రంగప్రవేశం, రెండో దశ తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్ ఆవిర్భావం, సీఎంగా కేసీఆర్ పాలన, తెలంగాణ అభివృద్ధి తదితర విషయాలు పొందుపరిచారు.
కాగా, మహేందర్‌ను దిండిగాల రాజేందర్ తదితరులు అభినందించారు.
రచయిత ఇల్లెందుకు చెందిన మహేందర్