
ప్రతీ గిరిజనుడికి సంక్షేమం
భధ్రాచలం: ఏజెన్సీ ప్రాంతంలో ప్రతీ గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్ తెలిపారు. శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను ఐటీడీఏలో ఘనంగా జరిపారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. దేశ నాయకుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యా, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు, సాగు, తాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఐటీడీఏ ప్రగతి నివేదికను సమర్పించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ భక్తి గీతాల నృత్యాలు అలరించాయి.
ఐటీడీఏ పీఓ రాహుల్