
450 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన
జూలూరుపాడు: స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం జూలూరుపాడులో 450 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆరోగ్య జీవనయాత్ర–వాకర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి శ్రీ సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం లక్ష్మీనర్సయ్య, జీవనయాత్ర సభ్యులు వేల్పుల బోసు, బాపట్ల వెంకటేశ్వర్లు, సాయిన్ని సత్యనారాయణ, తాళ్లూరి నవీన్, కిరణ్ చౌదరి, రామకృష్ణ, ఉసికల భాస్కర్, వందనపు కమలాకర్, ఉల్లి పూర్ణచందర్‌రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు పాల్గొన్నారు.