
సరిపడా మందులు సిద్ధంగా ఉంచాలి
కొత్తగూడెంఅర్బన్ : సెంట్రల్ మెడికల్ స్టోర్‌లో అవసరాలకు సరిపడా మందులు సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి సూచించారు. రామవరం ఎంసీహెచ్‌ను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా స్కానింగ్ సెంటర్‌తో పాటు రికార్డులు పరిశీలించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్‌లో స్టాక్ స్థితిని తనిఖీ చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రాల అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయాలని సూచించారు. అనంతరంగా ఆస్పత్రి ఆవరణలో మహిళా శక్తి క్యాంటిన్‌ను ప్రారంభించారు.
రామవరం యూహెచ్‌సీ తనిఖీ..
రామవరంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను జయలక్ష్మి గురవారం తనిఖీ చేశారు. పేషెంట్లతో మాట్లాడి వాధ్యుల నియంత్రణకు జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించాలని సూచించారు. సికిల్‌సెల్, తలసేమియాను ప్రారంభంలోనే గుర్తించడానికి హెచ్‌పీఎల్‌సీ పరీక్షలు చేయించుకోవాలని గర్భిణులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డా క్టర్లు శ్రీహరిరావు, నాగమణి, సరళ, ఉదయ్, పుల్లారెడ్డి, రామునాయక్, ఎండీ ఫైజ్ మొహియుద్దీన్, ఎల్.రామచందర్, శారద, అజయ్‌కుమార్, శంకరమ్మ పాల్గొన్నారు.