
వెంగళరాయ సాగర్ మట్టికట్టకు గండి
చండ్రుగొండ : మండలంలోని సీతాయిగూడెంలో ఉన్న వెంగళరాయసాగర్ అలుగు వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టికట్టకు గురువారం గండి పడింది. దీంతో ఎదుళ్లవాగు పొంగిప్రవహిస్తోంది. వరద తిప్పనపల్లి వాగు సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లల్లోకి వచ్చే ప్రమాదం ఉండటంతో తహసీల్దార్ సంధ్యారాణి పరిశీలించారు.
బాలుడిపై వీధికుక్క దాడి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లికి చెందిన బాలుడు లకావత్ హర్షిత్‌రాం ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో తల్లిదండ్రులు బాలాజీ, ఝాన్సీలు బాలుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.