
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పథకాలు
భద్రాచలం: గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన దర్బార్ నిర్వహించగా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దర్బార్‌కు వచ్చే గిరిజనులను మర్యాదపూర్వకంగా స్వాగతించాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాలు గిరిజనుల చెంతకు చేరేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అర్జిదారులు సైతం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ హరీష్, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఏఓ సున్నం రాంబాబు, ఎస్‌ఓ భాస్కర్, ఏపీఓ వేణు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్