
ఆర్టీఏలో చార్జీల పెంపు
లైసెన్స్ ఫీజు, సర్వీస్ చార్జీలు పెంచిన రోడ్డు రవాణా శాఖ
● గత నెల 27న జీఓ విడుదల చేసిన ఉన్నతాధికారులు ● జిల్లాలో 2,02,811 రవాణా వాహనాలు
పెరిగిన సర్వీస్ చార్జీలు ఇలా..
లెర్నింగ్ లైసెన్స్‌లకు గతంలో రూ. 335 ఉండగా రూ.440కు పెంచారు. టూ, ఫోర్ వీలర్ లైసెన్స్‌కు రూ.450 నుంచి రూ.585కు పెరిగింది. పర్మనెంట్ లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్‌కు రూ.1035 నుంచి రూ.1135కు పెంచారు. వాహన యాజమాన్య బదిలీలకు రూ.935 నుంచి రూ.1085కు పెంచారు. వాహన ఫైనాన్స్ కంపెనీల హామీ పత్రానికి రూ. 2,135 ఉండగా రూ.1000 పెంచారు. దీంతో రూ.3,135కు పెరిగింది.
లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్
కలిగి ఉండాలి
ప్రస్తుతం వాహనాల ఇన్‌వాయిస్‌ను బట్టి 0.1 నుంచి 0.5 శాతం వరకు సర్వీస్ చార్జీలు పెరిగాయి. లైసెన్స్‌లపై సర్వీస్ చార్జీ రూ.100 పెరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,02,811 టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయి. వాహనదారులందరూ లైసెన్స్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేయించకుండా వాహనాలను తిప్పొద్దు. వాహనదారులు లైసెన్స్‌లు, ఆర్‌సీ కలిగి రవాణాశాఖకు సహకరించాలి. రవాణాశాఖ నియమ నిబంధనలను పాటించాలి. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపొద్దు.
–వి.వెంకటరమణ,
ఇన్‌చార్జ్ జిల్లా రవాణాశాఖ అధికారి
కొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ లైసెన్స్ ఫీజులు, సర్వీసు చార్జీలను పెంచింది. లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్ ఫీజు రూ. 100 చొప్పున, సర్వీస్ చార్జీ వాహనాన్ని బట్టి 0.1 నుంచి 0.5 శాతం వరకు సవరించింది. గత నెల 27న జీఓ కూడా విడుదల చేసింది. అదే రోజు నుంచి పెరిగిన ధరలను అమల్లోకి తెచ్చింది. ప్రతీ వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. ఇవి రెండు లేకుండా వాహనాలను నడిపితే శిక్షార్హులవుతారని పేర్కొంటున్నారు. ట్రాన్ప్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 చొప్పున పెంచారు. ద్విచక్ర వాహనాలకు 0.5 శాతం, నాలుగు చక్రాల వాహనాలు, ఇతర వాహనాలు, బస్సులకు 0.1 శాతం సర్వీస్ చార్జీలు పెంచి అమలు చేస్తున్నారు.
గత మూడేళ్లలో 36,243 మందికి లైసెన్స్
జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,02,811 ద్వి, త్రీ, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వాహనం నడపాలంటే లైసెన్స్ తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పిస్తుండగా, ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వాహనదారుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా మూడేళ్లలో 36,243 మంది డ్రైవింగ్ లైసెన్స్ పొందారని ఇన్‌చార్జ్ ఆర్టీఓ వెంకటరమణ తెలిపారు.
2022 నుంచి 2025 జూలై వరకు జిల్లాలో కొనుగోలు చేసిన వాహనాల సంఖ్య
వాహన కేటగిరీ 2022లో 2023లో 2024లో 2025లో
హెవీ మోటార్ వెహికల్స్ 252 291 269 49
లైట్ మోటార్ వెహికల్స్ 3,531 4,420 5,258 950
మోటార్‌సైకిల్, స్కూటర్, మోపెడ్లు 4,351 5,189 5,336 926
ట్రాక్టర్లు 564 668 728 148
ఇతర కేటగిరీ వాహనాలు 763 1,082 1,269 199
మొత్తం 9,461 11,650 12,860 2,272

ఆర్టీఏలో చార్జీల పెంపు

ఆర్టీఏలో చార్జీల పెంపు