సాయి మందిరానికి రూ.లక్ష విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం ప్రభుత్వ జూని యర్ కళాశాల సెంటర్‌లోని శ్రీసాయిబాబా మందిర అన్నప్రసాద షెడ్డు నిర్మాణానికి ఓ భక్తుడు రూ.లక్ష విరాళం అందించాడు. పట్టణానికి చెందిన దివంగత చెరుకూరి సత్యవాణి జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు ఆలయ అధ్యక్షుడు కొమ్మనాపల్లి ఆదినారాయణకు మంగళవారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు కుటుంబసమేతంగా బాబావారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు దాతలకు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో చెరుకూరి మల్లికార్జునరావు, గొర్ల వెంకటేశ్వరరావు, శ్రీరామ్‌శర్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పునరావృతం
కాకుండా చర్యలు
భద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పరమత వ్యాఖ్యలతో ఉన్న కవర్లు రావడం చాలా దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సంఘం అధ్యక్షుడు అన్నెం శ్రీనివాసరెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. వస్త్రాలు విక్రయించే కాంట్రాక్టర్ స్క్రాప్ కవర్లను విక్రయించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు కాంట్రాక్టర్ వివరణ ఇచ్చాడని తెలిపారు. సున్నితమైన అంశంపై విపరీతమైన ప్రచారం జరగడంతో ఆలయ ఉద్యోగులు, రామ భక్తులు విచారం వ్యక్తం చేశారని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటన లు జరగకుండా చూస్తామని వివరించారు.
శ్రీలక్ష్మీ గణపతి ఆలయలో యంత్ర ప్రతిష్ఠ
సింగరేణి(కొత్తగూడెం): రామవరంలోని శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు పార్వతి సమేత రామలింగేశ్వర, పంచముఖ ఆంజనేయ, సుబ్రహ్మణ్యేశ్వర, నంది, ఉష్ణవాహన, శిఖర, నాగ, యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం యంత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. గణపతి పూజ, గోపూజ, పుణ్యావాచనం, పంచగ్రవ్య ప్రాశన, రక్షాబంధనం, రుత్వికరణం, దీక్షాధారణం, యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన నిర్వహించారు. సాయంత్రం పలు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
సాయి మందిరానికి రూ.లక్ష విరాళం


