కళలను కాపాడుకోవాలి
పాల్వంచ: దేశ సంస్కృతీ సంప్రదాయాలు, కళలను కాపాడుకుని, భావితరాలకు అందించాలని ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేఎస్‌పీ రోడ్‌లో పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో కళాకారుల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. అనంతరం పలువురు గాయకులు పాటలతో అలరించారు. ఆ తర్వాత తెలంగాణా ఉద్యమకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు, మహిపతి రామలింగం, దుర్గా అశోక్, కొత్త వెంకటేశ్వర్లు, మంతపురి రాజుగౌడ్, నరసింహాకుమార్, మంజూరు ఖాన్, రషీద్, కొండల రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కళలను కాపాడుకోవాలి


