
‘ఏకలవ్య’ సిద్ధం!
నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ములకలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ భవన నిర్మాణం పూర్తయింది.
8లో
●మూగజీవాలు జాగ్రత్త
అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వడదెబ్బ బారిన పడకుండా తగిన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఉత్పాదక శక్తిని రక్షించినట్లవుతుందని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటనారాయణ తెలిపారు. ఈమేరకు ఆయన ఇచ్చిన సూచనలిలా..
●అధిక వేడి, గాలి ప్రసరణ సరిగా లేకపోవటం, షెడ్లలో కిక్కిరిసి ఉంచడం, నీటి సౌకర్యం సరిగ్గా లేక పశువులు, జీవాలు వడదెబ్బకు గురవుతాయి. తద్వారా నీరసమై జీర్ణక్రియ తగ్గి ఆకలి మందగించి ఉత్పత్తి పడిపోతుంది. అంతేకాక వ్యాధి నిరోధక శక్తి తగ్గి, చూడి పశువులకు గర్భస్రావమయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిండి పదార్థాలు గంజి, జావ వంటివి పశువులకు ఆహారంగా ఇవ్వాలి. ఉదయం, సాయంత్రం పచ్చిగడ్డి, రాత్రికి ఎండుగడ్డి ఇవ్వాలి. పాడి పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వటం మంచిది. మేతకు ఉదయం, సాయంత్రమే తీసుకెళ్లాలి. వ్యాధులు దరిచేరకుండా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాక్సిన్లు వేయించాలి. పశువులకు మంచి, చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. వడదెబ్బకు గురైన పశువులను చల్లని గాలివచ్చే ప్రదేశంలోకి చేర్చి శరీర ఉష్ణోగ్రత తగ్గేలా పలుసార్లు నీటితో కడగాలి. తల, నుదుటిపై చల్లని గోనె సంచి కప్పాలి. ఆపై పశువైద్యులను సంప్రదించాలి.

‘ఏకలవ్య’ సిద్ధం!