పంట రుణ వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి
డీసీసీబీ సీఈఓ వెంకటఆదిత్య
అశ్వారావుపేటరూరల్: రైతాంగానికి ఇచ్చిన పంట రుణ వసూళ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని డీసీసీబీ సీఈఓ వెంకట ఆదిత్య అన్నారు. బుధవారం ఆయన అశ్వారావుపేటలోని సొసైటీతోపాటు డీసీసీబీ బ్యాంక్‌ను సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం అశ్వారావుపేట సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టారు. సొసైటీలో రికార్డులు, ఆన్‌లైన్ లావాదేవీలు, రుణాల వివరాలు, రికవరీలు, ఎరువులు, విత్తనాల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లపై వివరాలు సేకరించారు. ఏజీఎం వేణుగోపాల్, బ్యాంక్ మేనేజర్ అనూష, సొసైటీ కార్యదర్శులు హేమగిరి, అరుణ పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
అశ్వారావుపేటరూరల్: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తు న్న రెండుట్రాక్టర్లను బుధవారం స్థానికతహసీల్దార్ సీహెచ్‌వి రామకృష్ణ, ఎస్సై యయాతీ రాజు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. మండలంలోని అనంతారం గ్రామ శివారులోని వాగు నుంచి అశ్వారావుపేటకు తరలిస్తున్నట్లు గుర్తించా రు. పట్టుబడిన ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశా రు. కాగా, పట్టుబడిన ట్రాక్టర్లకు జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా తహసీల్దార్ తెలిపారు.


