బస్సులో గుండెపోటుతో వ్యక్తి..
టేకులపల్లి: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోనిసులానగర్‌కుచెందిన సూరేపల్లి రాము లు (70) బుధవారం తన భార్య, కూతురు (మానసిక దివ్యాంగురాలు)తో కలిసి కుమార్తె పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు ఆర్టీసీ బస్సులో టేకులపల్లికి బయలుదేరాడు. టేకులపల్లికి రాగానే గుండెపోటు వచ్చి పడిపోయాడు. స్థానికులు సీపీఆర్ చేసి, ప్రైవేట్ ఆస్ప త్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యు లు నిర్ధారించారు.
బస్సు ఢీకొని కండక్టర్ దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు)/టేకులపల్లి/ భద్రాచలం టౌన్ : బస్సును డ్రైవర్ వెనక్కి తీస్తుండగా సూచనలు చేస్తున్న కండక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇది. ఏపీలోని విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని వారధి సమీపాన బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం గంగారానికి చెందిన వజ్జ అభిలాష్ (40) కండక్టర్‌గా, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన తప్పిట ప్రకాశం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరు మంగళవారం భద్రాచలం నుంచి గుంటూరు వెళ్లి తిరిగి వస్తున్నారు. అయితే, మంగళవారం రాత్రి 10 గంటల సమయాన బస్సు వారధి దాటాక వై.జంక్షన్ నుంచి బస్టాండ్ వైపునకు వెళ్లాల్సి ఉండగా 300 మీటర్లు ముందుకు వెళ్లింది. దీన్ని గమనించిన డ్రైవర్ రివర్స్ చేసే క్రమాన కండక్టర్ బస్సు దిగి వెనకకు వెళ్లి సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే, ప్రమాదవశాత్తు బస్సు కండక్టర్‌ను ఢీకొట్టి తలపైకి ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉండగ, ఆయన సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చేసినట్లు విజయవాడ కృష్ణలంక పోలీసులు తెలిపారు.
వరకట్న వేధింపుల కేసు కొట్టివేత
భద్రాచలంటౌన్: వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ స్థానిక జ్యు డీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వి.శివనాయక్ బుధవారం తీర్పు చెప్పారు. 2021 లో దారపు విజయ్‌శంకర్‌రెడ్డి అతని తల్లి రమణమ్మపై వరకట్న వేధింపుల చట్టం కింద భద్రాచలంటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నేరం రుజువు కానందున న్యాయమూర్తి వారిని నిర్దోషులుగా ప్రకటి స్తూ తీర్పు వెలువరించారు. వారిపై ఉన్న వేధింపులు, వరకట్న కేసుల ను కొట్టివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ కూలీ మృతి
చండ్రుగొండ: మండలంలోని వెంకటియాతండా గ్రామంలో కూలీ పనులకు వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దామాకు దాస్ పనికా(73) బుధవారం రాత్రి మృతి చెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మోకాల కాలనీ జిల్లా నకావల్ రాంనగర్‌కు చెందిన దాస్ మిరప కోత ల నిమిత్తం ఈనెల 27న వచ్చాడు. రెండు రోజుల తర్వాత అనారోగ్యం బారిన పడిన ఆయనకు.. కొత్తగూడెం ఆస్పత్రిలో చికి త్స అనంతరం స్వస్థలానికి వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై పాపయ్య తెలిపారు.
మృతుడు టేకులపల్లి మండల వాసి
బస్సులో గుండెపోటుతో వ్యక్తి..


