రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీ లోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లికి చెందిన కొట్టే చిన్నతులసీరావు (54), వ్యవసాయంతోపాటు పొగాకు వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇదే మండలంలోని రాచ న్నగూడేనికి వెళ్లి.. తిరిగి అశ్వారావుపేట మండలంలోని వాగొడ్డుగూడెం మీదుగా తన స్వగ్రామానికి వస్తున్నాడు. అయితే, వాగొడ్డుగూడెం – లంకాలపల్లి మధ్యలోని మూలమలుపు వద్ద బుధవా రం విగతజీవిగా కనిపించాడు. కొద్దిదూరంలో ద్విచక్రవాహనం కూడా ఉంది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు శాంతికుమార్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెల్లడించారు.


