జిల్లా ప్రజలకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జిల్లా ప్రజలందరికీ బుధవారం ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరు ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధితో జీవనం సాగించాలని, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా సాగాలని ఆకాంక్షించారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బొకేలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావొద్దని సూచించారు. వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర అవసరమైన సామగ్రిని అందించాలని కోరారు. సామగ్రి పేద విద్యార్థుల చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా కొత్తగూడెం నియోజకవర్గం, జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్ల డించారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
మణుగూరు టౌన్: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్లు సాధించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. బుధవారం ఆయన మణుగూరు గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతరం శ్రమించాలని సూచించారు. కంప్యూటర్‌లో పిల్లలు పదాలకు సంబంధించిన మ్యాపింగ్ ఎలా చేస్తున్నారో పరిశీలించారు. మార్చి 31నాటికి అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మధుకర్‌ను ఆదేశించారు. అనంతరం తహసీల్‌ను సందర్శించి ఓటరు జాబితా సిద్ధం చేసే పనులపై ఆరా తీశారు. తహసీల్దార్ నరేష్‌కు పలు సూచనలు చేశారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా
ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్
గుండాల/ఇల్లెందు రూరల్: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎన్‌పీడీపీఎల్ డైరెక్టర్ మధుసూదన్, సీఈ రాజు చౌహాన్ అన్నారు. బుధవారం గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు మండలాల్లో విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు బోరుమోటార్ల వద్ద కెపాసిటర్లు అమర్చుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో 1912 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లను పరిశీలించారు. గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, రోజువారీ విద్యుత్ వినియోగం, లోడ్ వివరాలు తెలుసుకున్నారు. ట్రాన్స్‌కో అధికారులు రాంకుమార్, స్వామి, మహేందర్, రంగస్వామి, వెంకటేశ్వర్లు, రామారావు, జగదీష్, హనీషా తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపిక
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కళాశాలలో చదువుతున్న బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని శ్రావణం కావ్యశ్రీ జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్‌నకు ఎంపికై నట్లు కళాశాల ఏడీ డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. బుధవారం ఆమెను కళాశాలలో అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి స్రవంతి, డాక్టర్ పి ఝూన్సీ రాణి, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించి, హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు


