మార్గం సుగమం
కెరీర్ గైడెన్స్ కార్యక్రమంతో విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకునేందుకు మార్గం సుగమమవుతుంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఉన్నత ఉద్యోగులతో ప్రతి నెలా రెండు కెరీర్ గైడెన్స్ సెమినార్లను నిర్వహిస్తున్నాం. కళాశాల విద్యకు వెళ్లేలోపు విద్యార్థులు తాము ఏ కోర్సును, ఎందుకు ఎంపిక చేసుకోవాలనే విషయంపై స్పష్టత కలిగి ఉంటారు. ఉన్నతంగా స్థిరపడేలా గైడెన్స్ తోడ్పడుతుంది.
– చింతా చంద్రకళ, బాలికల
ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, దుర్గంగొల్లగూడెం


