టీఆర్‌ఈఎస్‌ఏ కార్యవర్గం ఎన్నిక
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.భగవాన్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా పి.శ్రీనివాసరావు, దారా ప్రసాద్, సెక్రటరీగా డి.పుల్లయ్య, కోశాధికారిగా రంగాప్రసాద్, ఉపాధ్యక్షులుగా డి.శంకర్‌రావు, జి.శిరీష, ఎం.తిరుపతిరావు, జి.శివకుమార్, కె.గణేశ్వరరావు, టి.అరుణ, సీహెచ్‌వీ రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కె.రమణేష్, జె.రఘు, ఎస్.రాంబాబు, ఎస్‌డీ హుస్సేన్, జాయింట్ సెక్రటరీలుగా జి.విజయలక్ష్మి, డి.కిషోర్, కె.నాగరాజు, జి.ప్రకాష్, దినేష్‌రాజు, కేఆర్‌కేవీ ప్రసాద్, ఈసీ మెంబర్లుగా కె.చైతన్య, కె.మధుసూదన్‌రావు, ఎస్‌కే అక్బర్, బి. అలేఖ్య, ధవళ రాజు, పి.గురుదీపక్, బి.రమలను ఎన్నుకున్నారు.


