విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధం
ఇల్లెందురూరల్: మండలంలోని తిలక్‌నగర్ జీపీ కల్తీ రామయ్య గుంపు గ్రామంలో ఆజ్మీర కిశోర్ ఇంట్లో ఆదివారం విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధమైంది. కిషోర్‌తోపాటు కుటుంబ సభ్యులు తెల్లవారుజామున నిద్ర లేచి ఆరుబయిట పనులు చేసుకుంటుండగా ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు ప్రయత్నించారు. విద్యుత్ తీగల నుంచి మంటలు వ్యాపిస్తుండటంతో కంగారుపడి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించగా.. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు.
ఆరు మందుపాతరల నిర్వీర్యం
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దాంతరి జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఆరు మందుపాతరలను ఆదివారం బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. దాంతరి జిల్లా ఎస్పీ సూరజ్‌సింగ్ కథనం ప్రకారం.. జిల్లాలోని బల్లారి సమీపంలో గల సాల్హీబాట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న డీఆర్‌జీ బలగాలు మూడు రైస్ కుక్కర్ బాంబులు, రెండు పైపు బాంబులు, ఒక టిఫిన్‌బాంబును గుర్తించాయి. వాటిని అక్కడే నిర్వీర్యం చేశాయి. వీటితో పాటు ఒక వాకీటాకీ కూడా లభ్యమైందని ఎస్పీ వెల్లడించారు.
విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధం


