స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యటన
దమ్మపేట: సీతారామ ప్రాజెక్టు కాల్వ భూసేకరణకు నియమితులైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్తీక్ మండలంలోని నాగుపల్లి గ్రామంలో శుక్రవారం పర్యటించారు. సేకరించిన భూములను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను కలిసి సమస్యలు వివరించారు. స్పందించిన ఆయన.. ప్రతి నిర్వాసిత రైతుకు పరిహారం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మోతీలాల్, గపూర్‌పాషా, సాగర్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు అడ్డుకట్ట
అశ్వారావుపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేస్తున్న అధికారులను శుక్రవారం కొందరు అడ్డుకున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలచెరువు గ్రామానికి 21 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. ఇందిరమ్మ కమిటీ ద్వారా వచ్చిన లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు వెళ్లిన డీటీ రామకృష్ణ, కార్యదర్శి స్వప్న, మున్సిపాలిటీ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ పేర్లలో అనర్హులు ఉన్నారని, అర్హులైన వారినే ఎంపిక చేయాలని వాగ్వాదానికి దిగారు. జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చని, సర్వేలో నిర్ధారించి అనర్హులు ఉంటే వారి పేర్లు తొలగిస్తామని అధికారులు చెప్పడంతో వివాదం సద్దుమనిగింది.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యటన


