
ఏడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..
టేకులపల్లి: అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. టేకులపల్లి ఎస్‌ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శంభునిగూడెం ముర్రేడు వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న శంభునిగూడెం, సూర్యాతండా, కూనారం, చంద్రుతండా, మంగ్యతండాలకు చెందిన ఏడు ట్రాక్టర్లను సులానగర్‌లో నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు డ్రైవర్లు, యజమానులు గుగులోత్ సురేష్, గుగులోత్ సర్ధార్, బానోత్ హత్తిరామ్, బానోత్ రమేష్, గుగులోత్ శివ, గుగులోత్ గన్యా, గుగులోత్ పవన్‌కల్యాణ్, గుగులోత్ భద్రు, పాయం సర్వేష్, బోడ మంగ్య, కంగల రాము, ఇలాసాగర్ కృష్ణ, బానోత్ శంకర్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్, మట్టి లారీలు..
బూర్గంపాడు: మండల పరిధిలోని మోతె పట్టీనగర్‌లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ట్రాక్టర్ యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు తప్పవని ఎస్‌ఐ రాజేశ్ హెచ్చరించారు. అలాగే మండల పరిధిలోని టేకులచెరువు గ్రామ సమీపాన సీతారామ ప్రాజెక్ట్ కాలువ మట్టిని రెండు టిప్పర్లలలో తరలిస్తుండగా.. శుక్రవారం ఉదయం ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టుకున్నారు. లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
13 మందిపై కేసు నమోదు