పినపాక: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పంచాయతీ మోటార్లు కాలిపోయిన ఘటన మండలంలోని జానంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పంచాయతీ అధికారుల కథనం ప్రకారం.. జానంపేట జెడ్పీహెచ్‌ఎస్ ప్రాంగణంలో మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వరిదొప్పలు కొన్ని మండించడంతో ఆ మంటలు వ్యాపించి మోటార్లు, వైర్లు, పైపులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని పంచాయతీ అధికారులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుండాల: ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అక్సర్ (45) గుండాలకు తునికాకు ప్రూనింగ్ పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. గుండాల – దుబ్బగూడెం మధ్య మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్సర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న సీఐ మృతదేహాన్ని ములుగు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు.
వరి గడ్డివామి దగ్ధం
పినపాక: ప్రమాదవశాత్తు వరి గడ్డివామి పూర్తిగా దగ్ధమైన ఘటన మండలంలోని అమరావరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత రైతు మహ్మద్ ముజాఫర్ కథనం ప్రకారం.. పొలంలో మూడు ఎకరాలకు సంబంధించిన వరిగడ్డిని పశువుల మేత కోసమని కుప్పగా వేశారు. ప్రమాదవశాత్తు వామికి మంటలు అంటుకోవడంతో గమనించిన రైతులు ఆర్పే ప్రయత్నం చేసేలోపు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.60 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు.
పంచాయతీ మోటార్లు దగ్ధం
పంచాయతీ మోటార్లు దగ్ధం