ఖమ్మం సహకారనగర్: ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులకు తాగునీరు సమకూర్చేందుకు గాను గతంలో విధులు నిర్వర్తించిన కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సుమారు 200 వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయించారు. అందరూ మిషన్ భగీరథ నీటినే తాగాలనే ఉద్దేశంతో వీటిని సమకూర్చారు. అయితే, అప్పుడొకటి.. ఇప్పుడొకటి అన్నట్లు బాటిళ్లు మాయమవుతుండగా ప్రస్తుతం 50కూడా లేవని సమాచారం. ప్రస్తుత కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ కలెక్టరేట్‌ను ప్లాస్టిక్ ఫ్రీగా మార్చాలనే లక్ష్యంతో శాఖల వారీగా ఎన్ని స్టీళ్లు బాటిళ్లు కావాలో నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో గతంలో కొనుగోలు చేసిన బాటిళ్లపై అధికారులు ఆరా తీయగా 200కు గాను 150మేర కనిపించడం లేదని తేల్చినట్లు సమాచారం. దీంతో ఈ బాటిళ్లు ఎవరు తీసుకెళ్లారు, ఎలా మాయమయ్యాయనే అంశంపై కలెక్టరేట్‌లో చర్చ జరుగుతోంది
ఖమ్మం కలెక్టరేట్‌లో 150కిపైగా సీసాలు మాయం