భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన యువత జీవనోపాధిని పెంపొందించుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా నెలకొల్పిన శ్రీ దుర్గా భవాని సెంట్రింగ్, బ్రిక్స్ యూనిట్‌ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.25 లక్షల వ్యయంలో రూ.15 లక్షల సబ్సిడీతో ఏర్పాటు చేసుకున్న యూనిట్ అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. మార్కెటింగ్ పెంచుకుని, బ్యాంకు రుణం ప్రతినెలా చెల్లించాలని సూచించారు. అనంతరం యంత్రాలు, సామగ్రిని పరిశీలించారు. ఇటుకలు రవాణా చేసే వాహనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వాహన తాళాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, అశోక్ కుమార్, హరికృష్ణ, యూనిట్ సభ్యులు రాజు, వెంకటమ్మ, మహేశ్వరి, వెంకటమ్మ, నాగరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
అర్థమయ్యే రీతిలో బోధించాలి
దుమ్ముగూడెం : విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శనివారం మండలంలోని జిన్నెలగూడెం జీపీఎస్ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3,5 తరగతి విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లలతో బోర్డుపై రాయించి పరిశీలించారు. అనంతరం గణిత శాస్త్రం అంటే పిల్లల్లో భయం పోగొట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఉద్దీపకం వర్క్ బుక్ లోని సారాంశాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నారని అన్నారు. ఏటీడీఓ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్