Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu Naidu's Opposition Behavior Towards Higher Officials
‘బాబు.. అధికారులను అవమానించడం సమంజసమేనా?’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడే తప్పులు చేయడం ఆరంభించినట్లు అనిపిస్తుంది. వయసు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఈసారి అందరి అభిమానాన్ని చూరగొనేలా ప్రభుత్వాన్ని నడిపితే మంచి పేరు వస్తుంది. టీడీపీ కొద్ది రోజుల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అనుసరించిన వైఖరి కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన తీరు కానీ చర్చనీయాంశం అవుతున్నాయి.కౌంటింగ్‌లో టీడీపీ గెలుస్తోందన్న సంకేతం వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులకు పైగా పార్టీ శ్రేణులు, గూండాలు విరుచుకుపడ్డ వైనం, చెలరేగిన హింసాకాండ చంద్రబాబుకు అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అయినా ఆయన దానిని లెక్కలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఆయన ధోరణి గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కొట్టుకు చావండి.. వైఎస్సార్‌సీపీ వారిని చంపితే చంపండి అన్న రీతిలో ఉదాసీనంగా ప్రవర్తించారు. ఇది దారుణమైన విషయం. వెంటనే అదుపు చేయాలని చంద్రబాబు ఆదేశించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిని బట్టి ప్రభుత్వ విధానం ఏమిటో అర్ధం అవుతుంది.ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కనుక సంప్రదాయం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంతా వచ్చి ఆయనను కలుస్తారు. కానీ గతంలో తనను ఆయా స్కామ్‌లలో అరెస్టు చేసిన కొందరు అధికారులను తన ఇంటివైపు రానివ్వలేదు. సచివాలయంలో చంద్రబాబు పదవీబాధ్యతలు తీసుకున్న తదుపరి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన అధికారుల పట్ల ఆయన చాలా కఠిన వైఖరి అవలంబించారు. ఈ అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పాత్ర పోషించారన్నది ఆయన భావన కావచ్చు. వారి నిర్ణయాల వల్ల టీడీపీకి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో తెలియదు. అయినా తనకు అధికారం వచ్చిన తర్వాత దానిని పట్టించుకోకుండా పాలన సాగించడం సాధారణంగా జరుగుతుంటుంది. అలాకాకుండా పాత విషయాలను గుర్తులో ఉంచుకుని అధికారులను వేధించాలని, అవమానించాలని చంద్రబాబు వంటి సీనియర్ నేత తలపెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు.సీనియర్ అధికారులను కిందిస్థాయి సిబ్బందితో చెప్పించి వెనక్కి పంపించడం, పుష్పగుచ్చం ఇవ్వడానికి చొరవ తీసుకుంటే వారికి అవకాశం ఇవ్వకుండా నిరోధించడం వంటివి జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఒక పక్క గత ప్రభుత్వం వ్యవస్థలను ద్వంసం చేసిందని చెబుతూ, ఇప్పుడు అంతకు మించి విద్వంసం చేసేలా ప్రవర్తిస్తే దాని ప్రభావం ఇతర అధికారులపై కూడా పడుతుంది. కీలకమైన బాధ్యతలలో ఉన్న అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ఎక్కువ సందర్భాలలో పనిచేస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం అయినా అంతే. చంద్రబాబు ఇచ్చే ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ అధికారి అయినా వెళతారా? ఆ ఆదేశాలు సరికాదని సంబంధిత అధికారి భావించినా, దానిని ఫైల్ మీద రాస్తారేమో కానీ, అంతిమంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వినవలసి ఉంటుంది. దీనిని విస్మరించి చంద్రబాబు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.పని అప్పగించి సరిగా నెరవేర్చకపోతే అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే అదో పద్దతి. అలాకాకుండా వారు కనిపించగానే అవమానించే రీతిలో వ్యవహరిస్తే మిగిలిన ఆఫీసర్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో గుర్తించాలి. ఒకవేళ వారు గత ప్రభుత్వ టైమ్లో ఏదైనా తప్పు చేశారని అనుకుంటే వారిపై విచారణకు ఆదేశించి చర్య తీసుకోవచ్చు. అది ఒక సిస్టమ్. కానీ అందరి మధ్యలో వారిపట్ల అమానవీయంగా చికాకు పడితే అది తప్పుడు సంకేతం పంపుతుంది. ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై కక్ష కట్టి అవమానించారన్న అభిప్రాయం ఏర్పడింది. ఆయన సెలవుపై వెళ్లారు. గతంలో ఆయన లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షించారు. లోకేష్ వద్ద పనిచేశారు కనుక, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నారా? లేదే! అదే జవహర్ రెడ్డిపై వీరికి ఎందుకో కోపం వచ్చింది.ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ప్రవీణ్ ప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకు వచ్చారు. స్కూళ్ల రూపు రేఖలు మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీచర్లతో గట్టిగా పనిచేయించే యత్నంలో కొంత విమర్శకు కూడా గురి అయ్యారు. టీచర్ల సంఘాలు ఆయనపై కక్ష కట్టాయి. ఇందులో ఆయన తప్పులు ఏమున్నాయో తెలియదు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌కు సన్నిహితంగా మెలిగారన్న కారణంగా ప్రవీణ్ ప్రకాశ్ పట్ల అసహనంగా ఉండడం సరైనదేనా అనే చర్చ వస్తుంది.మరో సీనియర్ అధికారి అజయ్ జైన్ పై కూడా చంద్రబాబు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటులో జైన్ ప్రముఖ పాత్ర వహించారు. అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కాకపోతే ఆయన ఎవరు అధికారంలో ఉంటే వారిని పొగుడుతారన్న భావన ఉంది. 2014లో చంద్రబాబు పాలన టైమ్ లో కూడా ఆయన కీలకంగానే ఉన్నారు. తదుపరి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ ప్రభుత్వంలో పనిచేశారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. దీనికి అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తారు. ఆ విషయాన్ని విస్మరించి ఆయనపై కూడా ద్వేషం పెట్టుకోవడం సరికాదు. మరో అధికారి శ్రీలక్ష్మి పుష్పగుచ్చం తీసుకు వస్తే ఆమె వైపు చూడడానికి కూడా సుముఖత కనబరచలేదట. ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే.అలాగే సునీల్ కుమార్, రఘురామిరెడ్డి , పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి మరికొందరు అధికారులతో కూడా అలాగే వ్యవహరించారట. ఏ అధికారి అయినా సంబంధిత ప్రభుత్వం ఏమి చెబితే దానికి అనుగుణంగానే పనిచేస్తారు. ఆ ప్రభుత్వ విధానాలతోనే వెళతారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారి ఆదేశాలను పాటిస్తారు. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఒకవేళ ఆ అధికారులపై సరైన అభిప్రాయం లేకపోతే వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వరు. విశేషం ఏమిటంటే ఆయా ముఖ్యమంత్రులు తమకు మొదట ఇష్టం లేరన్న అధికారులు తదుపరికాలంలో వారికి సన్నిహితులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు వద్ద పనిచేసిన ఒక సీనియర్ అధికారి స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆయన కంపెనీలలో సీఈఓ ఉద్యోగంలో చేరారు. అంటే వారి మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే కదా! మరో పోలీసు అధికారి తెలుగుదేశం పార్టీ అంతరంగిక వ్యవహారాలలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. మరి దానిని ఏమంటారు. గత ప్రభుత్వాన్ని తప్పు పట్టి, ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. ఆయన అధికారంలో ఉంటే అధికారులంతా సచ్చీలురుగా ఉన్నట్లు, లేకుంటే పాడైపోయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అదే పంధా అనుసరిస్తున్నట్లుగా ఉంది.ఇంకోరకంగా చూస్తే వారివల్లే ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని, తత్పఫలితంగా తాను అధికారంలోకి వచ్చానని ఆయన సంతోషించవచ్చు కదా! అలాకాకుండా కక్ష కట్టడం ఏమిటి! గత ప్రభుత్వంపై ప్రజలలో కసి ఏర్పడడానికి గత ఐదేళ్లలో జరిగిన విద్వంసకర పాలన అని, అందులో ఐఏఎస్, ఐపీఎస్ లకు పాత్ర ఉందని చంద్రబాబు అన్నారు. బాగానే ఉంది. మరి 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన తర్వాత టీడీపీకి 23 సీట్లే ఎందుకు వచ్చాయి? అంతకుముందు 2004 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? అధికారుల శైలి వల్ల అని ఆయన చెబుతారా! అప్పట్లో కూడా ప్రజలలో అలాంటి అభిప్రాయం ఏర్పడినట్లా?ఉన్నతాధికారులు అప్పుడు కూడా తప్పుగానే ప్రవర్తించినట్లేనా అనే ప్రశ్నకు జవాబు దొరకదు.ఏది ఏమైనా అధికారులను బెదిరించడానికి ఇలా చేస్తున్నారా? లేక వారిపై ఏదైనా చర్య తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియదు. కానీ ఇది ఒక చెడు సంప్రదాయం అవుతుందని చెప్పక తప్పదు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూడా చంద్రబాబు అక్కడ ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు అన్నారట. అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పిన అబద్దాలనే ఆయన కొనసాగిస్తున్నారని అనుకోవాలి. అది నిజమే అయితే ఆయన శాసనసభలో ఈ చట్టానికి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలి కదా! పైగా హైకోర్టులో నిలిచిపోయి ఉన్న చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు.కేంద్రం పంపిన ఈ నమూనా చట్టంపై జనంలో అవవగాహన కలిగించకుండా గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనానికి బాగానే వాడుకున్నారని చెప్పాలి. నైపుణ్య గణన అంటూ మరో ఫైల్ పై ఆయన సంతకం చేశారు. దానిని ఎలా ఆచరణలోకి తీసుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇలా చంద్రబాబు తాను మారానని, ఎవరిపై కక్ష పూననని అంటూనే సీనియర్ అధికారులను అవమానించడంపై విమర్శలు వస్తున్న మాట వాస్తవం. అధికారం ఎవరికి శాశ్వతం కాదని తెలిసినా, ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక, తమకు తిరుగులేదని ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడం మనబోటి సామాన్యులకు కష్టమేనేమో!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

Ex CM KCR Writes Letter To Narasimha Reddy Commission Over Power
రాజకీయ కక్షతోనే కమిషన్‌ ఏర్పాటు: కేసీఆర్‌ సీరియస్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ కక్షతోనే నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేశారని అన్నారు మాజీ సీఎం కేసీఆర్‌. కుట్రలతోనే నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, తాజాగా జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ 12 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో కేసీఆర్‌..‘రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉంది ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయింది. రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.నాడు గ్రామాల్లో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు కరెంటు కోతలు ఉండేవి. త్రీఫేస్ కరెంట్ కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89% ఆంధ్రప్రదేశ్‌కు 46.1 శాతం కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్‌ను వినియోగించుకోవాలని నిర్దేశించింది.విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా 1500 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. మొత్తంగా ఐదు వేల మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీన్ని అధిగమించి కొత్త ప్రాజెక్టులు నిర్ణయించి కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లు విద్యుత్తు 20000 మెగావాట్లకు పైచిలుకు చేరటం మా ప్రభుత్వానికి నిదర్శనంతెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త. రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కరెంటు కోసం తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయంగా మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.కేసీఆర్‌ లేఖ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విచారణ కోసం నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది.విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోంది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.

TDP Activists Attack On YSRCP Supporters In AP
కొనసాగుతున్న టీడీపీ దాడులు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు

సాక్షి, కర్నూలు: ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై పచ్చ బ్యాచ్‌ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పలువురి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు.ఇక, తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తుగ్గలి మండలంలోని డీసీకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శ్రీనివాసులుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శేఖర్‌పైనా దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బాధితులు జొన్నగిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పుంగనూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేత వెంకట్‌రెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పుంగనూరులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి కాసేపట్లో పుంగనూరుకు రానున్న నేపథ్యంలో పచ్చ బ్యాచ్‌ హంగామా చేస్తోంది.

Arrangement of red book hoardings across the state
రెడ్‌బుక్‌ రాజ్యాంగం

సాక్షి, అమరావతి: రాజకీయ ప్రత్యర్థులపై ఇటు ఆటవిక దాడులు కొనసాగిస్తూ అటు రాజ్యాంగాన్ని కాలరాసి నారా లోకేశ్‌ రాసుకున్న ‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’ అమలుకు రంగం సిద్ధమవుతోంది! రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌బుక్‌ హోర్డింగ్‌ల ఏర్పాటుతో తాము మరింతగా కొనసాగించనున్న విధ్వంసకాండ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను టీడీపీ నిర్భీతిగా చాటింపు వేస్తోంది. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ ఆ కుట్రకు సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా తెర తీయడం విస్తుగొలుపుతోంది. ఐఏఎస్‌ అధికారులే లక్ష్యంగా బ్లాక్‌ మెయిలింగ్, వేధింపులకు ఆయన శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేసే అధికారులను పనితీరు మదింపు నివేదికల పేరుతో లొంగదీసుకోవడం, అనంతరం తమ అక్రమాలకు వారిని సాధనంగా చేసుకోవడమే లక్ష్యంగా ఈ కుట్రకు అంకురార్పణ చేశారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న విపరిణామాలు, అక్రమాలు, బీభత్సకాండకు అధికార యంత్రాంగంతో నిర్వహించిన మొదటి సమావేశంలోనే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలి చ్చారు. ఒకవైపు తమకు ఓటేయనివారు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తూ మరోవైపు అధికార యంత్రాంగాన్ని సొంత అజెండా అమలుకు వాడుకునేందుకు సన్నద్ధమైనట్లు స్పష్టమవుతోంది. అటు వ్యాజ్యాలు.. ఇటు వార్నింగ్‌లు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుకు మంత్రి నారా లోకేశే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా లోకేశ్‌ ఫోటోలతో రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి టీడీపీ సర్కారు భయోత్పాతం సృష్టిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ నాయకుడి ఫొటోలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. టీడీపీ మాత్రం ‘రెడ్‌ బుక్‌’ పేరుతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం వారి హింసాత్మక ప్రవృత్తిని బట్టబయలు చేస్తోంది. మంగళగిరి, విజయవాడ, గుంటూరుతోపాటు రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల్లో ఈ హోర్డింగులు వెలిశాయి. ఎన్నికలకు ముందే ‘రెడ్‌బుక్‌’ పేరుతో అధికారులపై లోకేశ్‌ బెదిరింపులకు పాల్పడ్డారు. నిబంధనల మేరకు వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అందరి పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నానని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి సంగతి తేలుస్తానని, అంతు చూస్తానని హెచ్చరించారు. అఖిల భారత స ర్విసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులను ఇలా బ్లాక్‌మెయిల్‌ చేయడం సరికాదని అప్పట్లోనే రాజకీయ పరిశీలకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కూడా కొనసాగుతున్నాయి. వీటిని బేఖాతర్‌ చేస్తూ టీడీపీ తన కుట్రలకు పదును పెడుతోంది. పచ్చముఠాల విధ్వంసకాండ బీజేపీతో పొత్తును ఆసరాగా చేసుకుని టీడీపీ రౌడీమూకలు ఎన్నికలకు ముందే విధ్వంసకాండకు తెరతీశాయి. సమర్థంగా పని చేస్తున్న పోలీసు అధికారులను ఎన్నికల కమిషన్‌(ఈసీ) ద్వారా బదిలీ చేయించి మరీ గూండాగిరీకి పాల్పడ్డాయి. పోలింగ్‌ ముందు రోజు, అనంతరం దాడులు, దౌర్జన్యా­లతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. అల్లరి మూ­కలు కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టి విరుచుకుపడ్డాయి. బాంబు దాడులకు దిగాయి. ఎన్నికల్లో విజయం సాధించాక టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ యావత్‌ దేశాన్ని విభ్రాంతికి గురి చేస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి రేషన్‌ సరఫరా చేసే వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌ విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. టీడీపీ గూండాల విధ్వంసకాండతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు గ్రామాలను విడిచి వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఎన్నికల విధుల కోసం వచ్చిన కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్రంలో ఉండగానే పరిస్థితిలా ఉంటే.. తర్వాత ప్రభుత్వ పెద్దలు ఎలా వ్యవహరించనున్నారో స్పష్టమవుతోంది. వేధించే పన్నాగం అఖిలభారత సర్విసు అధికారులపై రాజకీయ ముద్ర వేసి వేధించాలని ఎన్నికల ముందే రూపొందించిన కుట్ర అమలుకు సన్నద్ధం కావడం ప్రభుత్వ పెద్దల దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. 40 ఏళ్ల అను­భవజ్ఞుడినని చెప్పుకుంటూ నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు అఖిలభారత సర్విసు అధికారుల విధి విధానాల గురించి పూర్తిగా తెలుసు. ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు మారుతుంటాయి గానీ రాష్ట్రానికి కేటాయించిన అఖిల భారత సర్విసు అధికారులు కొనసాగుతుంటారు. వారి సేవలను సమర్థంగా వినియోగించుకుంటూ మంచి పరిపాలన అందించడం ప్రభుత్వం బాధ్యత. అందుకు విరుద్ధంగా చంద్రబాబు రాజకీయ కక్షతోనే కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడేందుకు సిద్ధమవుతుండటం విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన కొందరు అధికారులను కలవకుండా వెనక్కి పంపారు. కొందరు అధికారులు ఇచ్చిన పూల బొకేలను సైతం తీసుకునేందుకు తిరస్కరించారు. ఇక తనను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగినట్టుగా లేవని పరిశీలకులంటున్నారు. గత ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు అన్యాయంగా ఉందని సీఎం నిందలు వేశారు. తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడటం లేదంటూనే తన అక్కసునంతా వెళ్లగక్కి వ్యక్తిగత అజెండాను బయటపెట్టారు. కక్ష సాధింపులుండవంటూనే కొందరు అధికారులు టార్గెట్‌గా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. సమాచార సేకరణలో బాబు బృందం అఖిల భారత సర్విసు అధికారులను వేధించే కుట్రకు చంద్రబాబు తెరతీశారు. తమవారు ఎవరు? పరాయి వారు ఎవరు? అనే సమాచారం సేకరించాలని తన బృందాన్ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి రాష్ట్రస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల వరకు సమాచారాన్ని సేకరించే పనిలో చంద్రబాబు బృందం నిమగ్నమైంది. ఆ విషయాన్ని టీడీపీ వర్గాలు బహిరంగంగానే వెల్లడిస్తున్నాయి. తద్వారా అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేయాలన్నది అసలు ఉద్దేశం.నిబంధనలకు విరుద్ధంగా తాము పురమాయించే పనులు చేసేలా లొంగదీసుకునే కుట్రతో ఈ తతంగాన్ని సాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఐదేళ్లూ తాము ఏం చెబితే అదే చేయాలి! నిబంధనలు ఉటంకిస్తూ అభ్యంతరాలు చెప్పకూడదు! అనే సందేశాన్ని దీని ద్వారా ఇవ్వనున్నారు. అందుకు సమ్మతించే అధికారులకే పోస్టింగులిస్తామని, లేదంటే వేధిస్తామని చెబుతుండటం చంద్రబాబు కుట్రను బట్టబయలు చేస్తోంది. ఇదేనా పెద్దరికం? ప్రభుత్వ పెద్దననే విషయాన్ని మరచిపోయి సీఎం చంద్రబాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో లోకేశ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జవహర్‌రెడ్డి ఆ శాఖ అధిపతిగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనూ అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనూ ఆయన నిబంధనల మేరకే విధులు నిర్వర్తించారు. అయితే చంద్రబాబు రాజకీయ కారణాలతో సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అవాస్తవ ఆరోపణలు చేశారు. ఆయన్ను బదిలీ చేయాలని ఈసీకి ఫిర్యా­దు­లు చేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవాలు లే­పో­వడంతో ఈసీ ఆయన్ను బదిలీ చేయలే­దు. ఎ­న్ని­కల ముందు సామాజిక పెన్షన్ల పంపిణీలోనూ ఈసీ ఆదేశాలనే ఆయన పాటించారు.అయినా సరే చంద్రబాబు ఆయనపై చిందులు తొక్కారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాక సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లిపోవాలని ఒత్తిడి తేవడం గమనార్హం. ఈ నెలాఖరున జవహర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. తాను బాధ్యతలు స్వీకరించే నాటికి జవహర్‌రెడ్డి విధుల్లో ఉండకూడదని చంద్రబాబు పట్టుబట్టి మరీ వేధించడం గమనార్హం. బాబు పేషీ అధికారులకూ జగన్‌ కీలక పోస్టింగ్‌లు2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను జగన్‌ తన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పోస్టింగులిచ్చా­రు. చంద్రబాబు పేషీలో పనిచేసిన సాయిప్రసాద్‌ను కీలకమైన సీసీఎల్‌ఏగా నియమించారు. ఆయన పేషీలో పనిచేసిన అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు–భవనాలు, రెవెన్యూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ శాఖల బాధ్యతలు అప్పగించారు. టీడీపీ హ­యాంలో ఆర్థిక శాఖలో పనిచేసిన అధికారులనే జగన్‌ తన ప్రభుత్వ హయాంలోనూ కొనసాగించా­రు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ చేతిలో చేతి­లో కాగితాన్ని బలవంతంగా లాక్కున్న ఐఏఎస్‌ అధి­కారికి కూడా కీలకమైన పోస్టింగ్‌ ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. జగన్‌ ఓడాడు.. ఇంకా చావలేదు! అయ్యన్న విద్వేష వ్యాఖ్యలు ‘‘జగన్‌ ఓడిపోయాడు కానీ ఇంకా చావలేదు’’ అంటూ టీడీపీ సీనియర్‌ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వాడు ఓడిపోయాడు కానీ చావలా..! అపారమైన ధన బలం ఉంది.. కుల బలం ఉంది.. పక్కన తెలంగాణ ప్రభుత్వంలో వీడి మనుషులు ఉన్నారు’ అని ఓ వ్యక్తి అందులో అయ్యన్నతో వ్యాఖ్యానించాడు. దీనిపై అయ్యన్న ప్రతిస్పందిస్తూ.. ‘చచ్చేదాక కొట్టాల! ఈయన చెప్పింది కరెక్టే. ఓడిపోయాడు కానీ చావలేదు. చాలా మంచి డైలాగ్‌ ఇది’ అని పేర్కొన్నారు. ఓడిపోయాడు కానీ చావలేదనే డైలాగ్‌ తనకు బాగా నచ్చిందంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు. పామును చచ్చేవరకు కొట్టా­లనే డైలాగ్‌ను తాను బయట మాట్లాడేటప్పుడు వాడతానంటూ తన నైజాన్ని చాటుకున్నారు.

There Is No Player For 4 5 6: Misbah ul Haq Slams Pakistan Selectors
పాక్‌ చెత్త ప్రదర్శన.. సెలక్టర్లపై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ సెలక్టర్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ మండిపడ్డాడు. మిడిలార్డర్‌లో ఆడే బ్యాటర్లు కనీసం ఒక్కరైనా జట్టులో ఉన్నారా అని ప్రశ్నించాడు.నాణ్యమైన ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేసే అలవాటే లేదా అంటూ మిస్బా సెలక్టర్లను తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో లీగ్‌ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్‌.. టీ20 ప్రపంచకప్‌-2024లోనూ అదే చెత్త ప్రదర్శన కనబరిచింది.గ్రూప్‌-ఏలో తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన బాబర్‌ ఆజం బృందం సూపర్‌-8 అవకాశలను సంక్లిష్టం చేసుకుంది. తాజాగా అమెరికా- ఐర్లాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో సూపర్‌-8 రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది.ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు బాబర్‌ బృందం, సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ప్రపంచకప్‌ టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో మిస్బా ఉల్‌ హక్‌ పాక్‌ మిడిలార్డర్‌ బ్యాటర్ల తీరును తూర్పారబట్టాడు. ‘‘మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లే లేరు.గత మూడు ప్రపంచకప్‌ టోర్నీల్లో.. 4, 5, 6 స్థానాల్లో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. అయినా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారు.అందరూ టాపార్డర్‌లోనే బ్యాటింగ్‌ చేస్తామంటే.. 4, 5, 6 స్థానాల్లో ఆడేది ఎవరు? బాబర్ ఆజం, ఇఫ్తికార్‌ అహ్మద్‌ వంటి అత్యుత్తమ ప్లేయర్లు జట్టులో ఉన్నా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారు.జట్టు ఇలా పతనమవడానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఇలాంటి ఫలితాలకు ఎవరు కారణం?’’ అంటూ మిస్బా ఉల్‌ హక్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్‌-2024లో పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ బ్యాటర్లు సాధించిన పరుగులు👉ఫఖర్‌ జమాన్‌- అమెరికా మీద- 11 (7) ఇండియా మీద- 13 (8), కెనడా మీద 4 (6).👉ఇఫ్తికార్‌ అహ్మద్‌- అమెరికా మీద 18 (14), ఇండియా మీద 5 (9).👉ఆజం ఖాన్‌- అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌👉ఇమాద్ వసీం- ఇండియా మీద 15 (23).👉షాదాబ్‌ ఖాన్‌- అమెరికా మీద 40 (25), ఇండియా మీద 4 (7).చదవండి: T20 WC 2024- SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి!

 PM Narendra Modi Selfie With Giorgia Meloni At G7 summit
ఇటలీ పీఎం మెలోనితో మోదీ సెల్ఫీ.. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌

రోమ్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. జీ-7 దేశాల సదస్సులో భాగంగా రెండు రోజులు ఇటలీలో పర్యటించారు మోదీ. జీ-7 సదస్సుల్లో పలు దేశాధినేతలతో కీలక భేటీల్లో మోదీ పాల్గొన్నారు. కాగా, ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని మెలోనితో మోదీ సెల్ఫీ తీసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జీ-7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీ.. శుక్ర‌వారం ఇట‌లీ ప్ర‌ధాని జార్టీయా మెలోనితో సెల్ఫీ దిగారు. చేతిలో ఫోన్ పట్టుకున్న మెలోనీ.. మోదీతో ఫోటో దిగారు. సెల్ఫీ దిగుతూ ఇద్ద‌రూ ఫుల్ స్మైల్ ఇచ్చుకున్నారు. ఆ సెల్ఫీ ఫోటో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. PM Narendra Modi and Italy's PM Giorgia Meloni's selfie on the sidelines of the G7 summit, in Italy. pic.twitter.com/wE1ihPHzeq— ANI (@ANI) June 15, 2024 Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024 ఇదిలా ఉండగా.. గ‌తేడాది దుబాయ్‌లో కాప్‌-28 స‌ద‌స్సు జ‌రిగిన స‌మ‌యంలో కూడా వీరిద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫోటో కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో మరోసారి తెరపైకి వచ్చింది. 1. #COP28 summit in Dubai.2. #G7 summit in Italy#Melodi #Selfie #G7Italie #G72024 pic.twitter.com/otVV1YGaMh— Rai Sahab 🇮🇳 (@raiparas) June 15, 2024 The Moment we all have been waiting for ☺️☺️😂 pic.twitter.com/5hdahECYMa— Amit Shah (Parody) (@Motabhai012) June 14, 2024 Had a very good meeting with PM @GiorgiaMeloni. Thanked her for inviting India to be a part of the G7 Summit and for the wonderful arrangements. We discussed ways to further cement India-Italy relations in areas like commerce, energy, defence, telecom and more. Our nations will… pic.twitter.com/PAe6sdNRO9— Narendra Modi (@narendramodi) June 14, 2024

YSRCP Parliamentary Party meeting
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు

సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమే. మన పరిపాలన – చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసి గమనిస్తూనే ఉంటారు. కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఈలోగా మనం ధైర్యాన్ని కోల్పోకూ­డదు. విలువలు, విశ్వసనీయతతో ముంద­డుగు వేద్దాం’’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచిం­­చారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌­ï­Üపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాహితమే పర­మా­వధిగా పార్లమెంట్‌లో వ్యవహరించాల­న్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనా­లను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే ఎవరికైనా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ విధివిధానాల ప్రకారం అడు­గులు వేస్తూ ప్రజల ఎదుట తలెత్తుకునేలా ఎంపీలు ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.సమావేశంలో ఎంపీలు వైవీ సుబ్బా­రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వైఎస్‌ అవినాష్‌­రెడ్డి, పి.మిథున్‌రెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌.. మోపిదేవి వెంకటరమణ, ఎం.గురుమూర్తి, బీద మస్తాన్‌రావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, గొల్ల బాబూరావు, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, మేడా రఘునాధరెడ్డి, డాక్టర్‌ చెట్టి తనూజరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..నాణ్యమైన విద్యతో పేదరికం శాశ్వతంగా నిర్మూలన..గత ఐదేళ్ల పాటు ఎప్పుడూ చూడని మంచి పరిపాలన అందించాం. మేనిఫెస్టోలో హామీలు 99 శాతం అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇలా ఎప్పుడూ ఎవరూ చేయలేదు. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్‌ ప్రకటించి మరీ అమలు చేశాం. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బ తీసిన కోవిడ్‌ లాంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లాం. అవినీతికి చోటులేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాం. అర్హులందరికీ ప్రభుత్వ నుంచి ప్రయోజనాలు అందించాం. విద్యా రంగంలో సంస్కరణలు తెచ్చి పేదరికం నిర్మూలన దిశగా అడుగులు వేశాం. భవిష్యత్తు తరాలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఇంగ్లీషు మీడియం, టోఫెల్, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌) ద్వారా బోధన, ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్‌లు అందచేశాం. ఐబీ సిలబస్‌ కూడా తెచ్చాం. ప్రఖ్యాత అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను విద్యార్థులకు అందించాం. నాణ్యమైన విద్య అందించడం ద్వారా పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే దిశగా ఐదేళ్లలో అడుగులు వేశాం.శకుని పాచికల్లా ఫలితాలు..సోషల్‌ ఇంజనీరింగ్‌లో భాగంగా ఎప్పుడూ చూడని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించాం. ఇన్ని గణనీయమైన మార్పులు తెచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయనిపిస్తోంది. ఏం జరిగిందో దేవుడికే తెలియాలి.నాడు మద్దతిచ్చి నేడు విషప్రచారంల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో ఆ యాక్ట్‌ తెచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ కూడా మద్దతు పలికింది. అమెరికా, యూరప్‌ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించింది. సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఒక భూతంలా చూపించి టీడీపీ, కూటమి పార్టీలు విష ప్రచారం చేశాయి. ఈ చట్టాన్ని తేవడం అంత సులభమైన విషయం కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించింది. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా ఎలాంటి మోసాలకు ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టం వల్ల వస్తాయి. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. పత్రాల విషయంలో తప్పులు జరిగితే సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. గతంలో తాము మద్దతు పలికిన చట్టాన్ని టీడీపీ వాళ్లు ఇప్పుడు తీసేస్తామంటున్నారు. వారు చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీన్ని బట్టే తెలుస్తుంది.ప్రజలపై సంపూర్ణ విశ్వాసం..వైఎస్సార్‌ సీపీని నమ్ముకుని కొన్ని కోట్ల కుటుంబాలున్నాయి. లక్షల మంది కార్యకర్తలు పార్టీపై ఆధారపడి ఉన్నారు. వేల మంది నాయకులు పార్టీలో ఉన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో మనకు 40 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే పది శాతం ఓట్లు తగ్గాయి. రానున్న రోజుల్లో ఈ పది శాతం ప్రజలే మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ మన ప్రభుత్వం చేసిన మంచి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం, పోరాట పటిమ సన్నగిల్లకూడదు. నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఏమాత్రం తగ్గలేదు. 14 నెలలు పాదయాత్ర చేశా. దేవుడి దయ వల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి ఉంది. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తారనే సంపూర్ణ విశ్వాసం, నమ్మకం నాకు ఉంది.ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి..పార్లమెంట్‌లో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులున్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు. టీడీపీకి 16 మంది ఉన్నారు. అందువల్ల మన పార్టీ చాలా బలమైనదే. మనల్ని ఎవరూ, ఏమీ చేయలేరు. మనం ధైర్యంగా నిలబడి ప్రజల తరఫున పోరాటం చేయాలి. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి.పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డి..గతంలో మాదిరిగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారు. లోక్‌సభలో మన పార్టీ నాయకుడిగా మిథున్‌రెడ్డి వ్యవహరిస్తారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు. అందరికీ నేను అందుబాటులో ఉంటా. ఎంపీలంతా కలసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలి. పార్టీ పరంగా వ్యవహరించాల్సిన అంశాలపై పరస్పరం చర్చించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలి. మన పార్టీకి ఒక సిద్ధాంతం, గుర్తింపు ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడండి. పార్టీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది.

Massive encounter between police and naxalites, several deceased
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఎనిమిది మంది నక్సల్స్‌ మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీగఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నారాయణ్‌పూర్‌ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మృతి చెందారు. రెండు రోజులుగా ఎదరు కాల్పులు కొనసాగుతున్నాయి. కుతుల్‌, ఫరస్‌బేడ, కొడతమెట్ట సరిహద్దు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ ఘటన జరిగింది. ఇద్దరు జవాన్లకు గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.అబూజ్మడ్ అడవుల్లో డీఆర్జీ, ఎస్టీ ఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇటీవల నారాయణపూర్‌-దంతేవా-కొండగావ్‌ అంతర్‌ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Vishnu Manchu Comments On Prabhas Role In Kannappa Movie
'కన్నప్ప'లో ప్రభాస్‌ సీన్స్‌ గురించి మంచు విష్ణు కామెంట్స్‌

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప టీజర్‌ తాజాగా విడుదలైంది. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఫాంటసీ డ్రామాగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా అలరించనున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తుండగా విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే, ప్రభాస్‌తో తనకు ఎలాంటి కాంబినేషన్ సీన్స్‌ లేవని మంచు విష్ణు పెద్ద బాంబ్ పేల్చారు. వీరిద్దరి మధ్య సీన్స్‌ ఉంటాయని ఇద్దరి ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్ కాంబినేషన్ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదని ఇదే విషయాన్ని మంచు విష్ణు స్వయంగా బయటపెట్టారు. కానీ, మిగిలిన అందరి స్టార్స్‌ కాంబినేషన్‌లో ప్రభాస్‌ కనిపిస్తారని ఆయన తెలిపారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో 'కన్నప్ప' చిత్రాన్ని ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. టీజర్‌లోనే ఆయన ప్రతిభ కనిపిస్తుంది. తిన్నడు పాత్రలో విష్ణు పరిచయమైన తీరు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటే.. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చేసిన సాహసాలు సినిమా అభిమానులను మెప్పిస్తున్నాయి.

Joe Biden campaign trolls on trump he is a crook and failure
‘డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక మోసగాడు, ఫెయిల్యూర్‌’

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్‌ పార్టీ ప్రెసిడెంట్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గత కొంత కాలం నుంచి అధిక వయసు పేరుతో జో బైడెన్‌(81)పై విమర్శలు గుప్పిస్తున్నారు. నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇదే విషయాన్ని ట్రంప్‌ ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. బైడెన్‌తో పోల్చితే అమెరికాకు తానే చురుకైన ప్రెసెడింట్‌గా ఉండగలనని పేర్కొంటున్నారు. అయితే శుక్రవారం ట్రంప్‌ సైతం 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. దీంతో జో బైడెన్‌ ఎన్నికల ప్రచారం బృందం ఓ వైపు ట్రంప్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియజేస్తునే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఓ సందేశం పంపారు.‘హ్యాపీ బర్త్‌ డే ట్రంప్‌. మీరు మోసపూరిత, ఫెయిల్యూర్‌ వ్యక్తి. అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, హాక్కులు, భవిష్యత్తుకు మీరు చాలా ప్రమాదకారి. మీరు ఇక ఎప్పటికీ అమెరికాకు ప్రెసిడెంట్‌ కాలేరు. మీ 79వ బర్త్‌డేకు అదే మొదటి అందమైన బహుమతి అవుతుంది’అని తెలిపింది. అదేవిధంగా అధ్యక్షుడు బైడెన్‌ అధికార యంత్రాగం సైతం ట్రంప్‌పై విమర్శలు చేస్తూ.. ట్రంప్‌ సాధించిన 78 విజయాలు ఇవే అంటూ ఆయనపై ఉన్న కేసులు, అభియోగాల జాబితాను విడుదల చేసింది. పలు కేసులు, అభియోగాలు మోపబడిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ట్రంప్‌ అని ఎద్దేవా చేసింది.అంతకుముందు ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ ట్రంప్‌కు ఎక్స్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ‘అధిక వయసు ఉ‍న్న వ్యక్తి నుంచి మరో ఎక్కువ వయసు ఉ‍న్న వ్యక్తిగా బర్త్‌ డే శుభాకాంక్షలు అందుకోండి. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. దానికి ఎన్నికలతో సంబంధం లేదు. ఎన్నికలు అధ్యక్షుడి ఎంపిక చేసేవి మాత్రమే’’ అని బైడెన్‌ అన్నారు. ఇక.. ట్రంప్‌ అరోపించినట్లు గానే జో బైడెన్ అధిక వయసు​, మతిమరుపుతో ఇబ్బంది పడినట్లు పలు సందర్భాల్లో కనిపించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. ట్రంప్‌ 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇద్దరు అధిక వయసు నేతలు అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడటం అమెరికాలో తొలిసారి కావటం గమనార్హం.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement