
గంజాయి తరలిస్తున్న వ్యక్తితో ఎకై ్సజ్ అధికారులు
బూర్గంపాడ్: మండలం మీదుగా నిషేదిత సారాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులో కి తీసుకుని 32 లీటర్ల నాటుసారా, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలి పారు. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమి షనర్ జనార్ధన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్(ఎన్‌ఫోర్స్‌మెంట్) గణేశ్, ఏఈఎస్ తిరుపతి ఆదేశాలతో ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సర్వేశ్వర్ ఆధ్వర్యాన సారపాక మోతె, ఇరవెండి ఏరియాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుండువారిగూడెం నుంచి సారపాకకు సారాయి తరలిస్తున్న మాలోత్ సునీత, బుయ్యేటి లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అనిల్, సిబ్బంది సుధీర్, వెంకటేశ్, హరీశ్, విజయ్, హన్మంతరావు తదితరులు ఉన్నారు.
ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టివేత
పాల్వంచ: ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని ఎకై ్స జ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. పాల్వంచ ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా డిప్యూటీ కమిషనర్ జి.జనార్ధన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్ ఆదేశాల మేరకు పాల్వంచ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సును సోదా చేశారు. ఈ దాడిలో ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరి బాపనపల్లికి చెందిన మల్లపడియామి అనే వ్యక్తి అదుపులోకి తీసుకుని స్వాధీనం చేయగా.. అతడి వద్ద రూ.2.50 లక్షలు విలువ చేసే రూ.10 కేజీల గంజాయి లభించింది. అదేవిధంగా బూర్గంపాడు నుంచి పాల్వంచకు 20 లీటర్ల నాటు సారాను తరలిస్తున్న కొత్తగూడెం కారుకొండ రామవరంకు చెందిన భూక్యా శ్రీను వద్ద స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిస్తే 87126 58852కు సమాచారం అందించాలని కోరారు.
కోడి పందేల స్థావరాలపై దాడి
చింతకాని: మండలంలోని కోమట్లగూడెం గ్రామ సమీపంలో కోడి పందేలను నిర్వహిస్తున్న స్థావరాలపై ఆదివారం రాత్రి ఎస్‌ఐ రాజేందర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పందెం కోళ్లు, ద్విచక్ర వాహనాలతో పాటు కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారైనట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట స్థావరంపై..
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు గ్రోమోర్ సెంటర్ వెనుక చెట్ల పొదల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులు, రూ.1,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కామేపల్లిలో..
కామేపల్లి: మండలంలోని జోగ్గూడెం గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేసి ఆరుగురు యువకులను ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్వాధీనం చేసుకున్న నాటుసారా విక్రేతలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు