పద్మశాలి వెల్ఫేర్‌ సొసైటీ సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

పద్మశాలి వెల్ఫేర్‌ సొసైటీ సేవలు ప్రశంసనీయం

Nov 16 2026 1:32 AM | Updated on Nov 16 2026 1:32 AM

తెనాలి: పట్టణానికి చెందిన పద్మశాలి వెల్ఫేర్‌ సొసైటీ గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని భారత ప్రభుత్వ డెప్యూటీ సెక్రటరీ దామర్ల శ్రీనివాసరావు (న్యూఢిల్లీ) అన్నారు. విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌, నోట్‌ బుక్స్‌ పంపిణీ, క్విజ్‌ కాంపిటీషన్‌ నిర్వహణ, గ్రామర్‌ కోచింగ్‌ క్లాస్సెస్‌ మరియు మెడికల్‌ క్యాంప్స్‌ నిర్వహించటం, పద్మశాలి వివాహ పరిచయ వేదిక ద్వారా వధూవరుల తల్లిదండ్రులే స్వయంగా సంబంధములు కుదుర్చుకునే అవకాశాలను కల్పించటం వంటి అంశాలు సంఘీయుల ఎదుగుదలకు తోడ్పడతాయని చెప్పారు. ది పద్మశాలి వెల్ఫేర్‌ సొసైటీ 31వ వార్షికోత్సవం ఆదివారం ముత్యంశెట్టిపాలెంలోని కళ్యాణమండపంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలలో గెలుపొందిన పద్మశాలి ప్రతినిధులు దివి అనిత, గుంటి ధనలక్ష్మి, జగ్గడిగుంట పాలెం ఎంపీటీసీ గోలి శ్రీనివాసరావులను సభలో సత్కరించారు. సేవాకార్యక్రమంలో భాగంగా 250 మంది పేద మహిళలకు దుప్పట్ల పంపిణీ చేశారు. పద్మశాలి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జొన్నాదుల మహేష్‌, సొసైటీ ప్రధాన సలహాదారు, రాచాబత్తుని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీజేకే నరేంద్రబాబు, కోశాధికారి దివి పురుషోత్తం, ఉపాధ్యక్షులు. శ్రీ దామర్ల పరమేశ్వరరావు, పంచుమర్తి భాస్కరరావు, కార్యదర్శులు గంజి ప్రభాకరరావు, దివి హేమంత్‌ కుమార్‌, కటకం శేషగిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement