ముగిసిన ‘ఏపీ హ్యాంఫెస్ట్‌ – 2026’ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘ఏపీ హ్యాంఫెస్ట్‌ – 2026’

Nov 16 2026 1:32 AM | Updated on Nov 16 2026 1:32 AM

గుంటూరు మెడికల్‌: గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో ఆదివారం ఏపీ హ్యాంఫెస్ట్‌ – 2026 ఘనంగా నిర్వహించారు. హామ్‌ రేడియో సాంకేతికతపై విద్యార్థులు, యువతలో అవగాహన పెంపొందించడం, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థగా దాని ప్రాధాన్యతను చాటిచెప్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.గుంటూరు నగర మేయర్‌ కోవెలమూడి లకీ్‌ష్‌క్ష్మీ అపర్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీవీఐటీ చాన్స్‌లర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ ఎలక్ట్రానిక్స్‌, హామ్‌ రేడియో ప్రదర్శన స్టాళ్లను ప్రారంభించారు. డాక్టర్‌ మల్లెంపల్లి పెరుమాళ్లు, బైర్సెట్టి మల్లికార్జున రావు, కన్వీనర్‌ డాక్టర్‌ కాకాని పథ్వీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బంగ రాష్ట్రాల నుంచి సుమారు 110 మంది హామ్‌ రేడియో ఆపరేటర్లు పాల్గొన్నారు. ఎనిమిది పాఠశాలలు, ఐదు కళాశాలలు, రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన సుమారు 120 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మేయర్‌ లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ప్రయోగాలు, సాంకేతిక నమూనాలు ఆకట్టుకున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, యాంటెన్నా సాంకేతికత, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థుల ప్రయోగాలు, నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విపత్తుల సమయంలో హామ్‌ రేడియో ద్వారా అత్యవసర సమాచార సేవలు అందించే విధానాలపై సాంకేతిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా హామ్‌ రేడియో రంగంలో విశేష సేవలందిస్తున్న 14 మంది సీనియర్‌ ఆపరేటర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన కో–కన్వీనర్‌ రామకృష్ణ, రమణ మూర్తి, బాలసుబ్రహ్మణ్యం, అనువ ప్రసాదు, వే ల్పూరి సీతారాములు, కుమారి ఝాన్సీ ఇతర ని ర్వాహకులను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఏపీ హ్యాంఫెస్ట్‌ – 2026 విజయవంతమైందని కన్వీనర్‌ డాక్టర్‌ కాకాని పథ్వీరాజ్‌ తెలిపారు.

నాలుగు రాష్ట్రాల నుంచి 110 మంది హామ్‌

ఆపరేటర్లు, 120 మంది విద్యార్థుల భాగస్వామ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement