మూడు దశల్లో ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

మూడు దశల్లో ఎన్నికలు

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

ఆదివారం శ్రీ 15 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 మూడు దశల్లో ఎన్నికలు నిమ్మకాయల ధరలు ఉచిత ప్రసాద వితరణకు విరాళం మెరుగైన సౌకర్యాలు జనసేన సైకోలపై చర్యలు తీసుకోవాలి ● గ్రామ పంచాయతీలకు మొదటిదశలో ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్‌ చెప్పారు. 15వ తేదీ నుంచి 17వరకు నామినేషన్ల స్వీకరణ, 18వ తేదీన నామినేషన్ల పరిశీలన, 19వ తేదీన తిరస్కరణ గురైన నామినేషన్లకు ఆర్డీఓల వద్ద అప్పీల్‌ చేసుకొనే అవకాశం, 20వ తేదీన అప్పీళ్ల పరిష్కారం, 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అదేరోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. 26వ తేదీన ఎన్నికలు జరుగుతాయన్నారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. ఉప సర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియ అదే రోజు జరుగుతుందన్నారు.

న్యూస్‌రీల్‌

జిల్లాలో 351 పంచాయతీలకు, బాపట్ల మున్సిపాల్టీకి ఎన్నికలు వెల్లడించిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల
ఆదివారం శ్రీ 15 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.6000, మోడల్‌ ధర రూ.4200 వరకు పలికింది.

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ ఉచిత ప్రసాద వితరణకు హైదరాబాద్‌కు చెందిన వీరమాచినేని శివప్రసాద్‌ కుటుంబం శనివారం రూ.1,01,116 విరాళాన్ని అందజేసింది.

పట్నంబజారు: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏపీఎస్‌ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ డి.సాంబ్రాజ్యం అన్నారు. గుంటూరులో శనివారం సమావేశం నిర్వహించారు.

వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

మాచర్ల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు తెర తీసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ట్విట్టర్‌ వేదికగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై జనసేన సైకోలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిన్నెల్లి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మాచర్ల పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 11న జనసేన సైకోలు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలపై దాడులు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాచర్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌లు బోయ రఘురామిరెడ్డి, అబ్దుల్‌ జలీల్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీను, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్‌ సత్తార్‌, మాజీ కౌన్సిలర్‌ మందా సంతోష్‌, మైనార్టీ నాయకుడు ముస్తఫా, నాగాంజనేయులు, అల్లి జీవన్‌ పాల్గొన్నారు.

బాపట్ల: బాపట్ల జిల్లాలోని 351 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం 3,362 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం 3,770 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 4,23,910 మంది పురుష ఓటర్లు ఉండగా, 4,43,995 మంది మహిళా ఓటర్లు ఉన్నారని, 49 మంది ఇతరులు ఉన్నారన్నారు. గ్రామ పంచాయతీల్లో మొత్తం 8,67,954 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొదటి దశలో పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు, చినగంజాం, కారంచేడు, మార్టూరు, పర్చూరు, యద్దనపూడి మండలాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. రెండో దశలో వేమూరు, చీరాల నియోజకవర్గాల్లోని అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు, కొల్లూరు, వేమూరు, చీరాల, వేటపాలెం మండలాలలో ఎన్నికలు జరుగుతాయన్నారు. మూడో విడతలో బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

ఏకగ్రీవాలకు నగదు బహుమతి

ప్రజాస్వామ్యంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు జీఓ నెంబర్‌ 11 ఆధారంగా బహుమతులను ఎన్నికల కమిషన్‌ ప్రకటించిందన్నారు. ఐదు వేలమంది జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవం అయితే రూ.15 లక్షలు పంచాయతీ అభివృద్ధికి బహుమతి లభిస్తుందన్నారు. ఐదు వేల నుంచి పదివేల మంది జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.25లక్షలు బహుమతి లభిస్తుందన్నారు. పదివేల మంది జనాభాకు మించి ఉండి ఏకగ్రీవం అయ్యే గ్రామ పంచాయతీకి రూ.50 లక్షలు బహుమతి వస్తుందన్నారు.

గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి

కలెక్టరేట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. విద్యపై విస్తృతమైన అవగాహన కల్పించడానికి గ్రంథాలయం ఏర్పాటు చేశామన్నారు. తన దగ్గర ఉన్న ఆరు పుస్తకాలు గ్రంథాలయానికి ఇచ్చానని, పరిపాలన పరమైన అంశాలు, తెలుగు సాహిత్యానికి చెందిన పుస్తకాలు ఎవరైనా విరాళంగా ఇవ్వవచ్చన్నారు. విద్య ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, విద్యను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి నగేష్‌ కుమారి, బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ హాసిని పాల్గొన్నారు.

నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి

పర్చూరు(చినగంజాం): గ్రామ, వార్డు సభ్యులకు సంబంధించిన నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని స్వర్ణ, పర్చూరు, బోడవాడ, మండగుంటలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే గ్రామ, వార్డు సభ్యులకు సంబంధించి నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు నామినేషన్‌ స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, విద్యుత్‌, ఫర్నీచర్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికలు నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్‌ స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు నిబంధనలు పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ ఏ.హరికుమార్‌, తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, ఎంపీడీఓ వి.ప్రద్యుమ్నకుమార్‌, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఎన్నికలు ఇలా..

బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రకటన విడుదల చేశామని కలెక్టర్‌ తెలిపారు. 14వ తేదీ నుంచి 16 సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. 17వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ నెల 19వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, తదుపరి పోటీలో ఉండే అభ్యర్థుల తుదిజాబితా ప్రకటిస్తామన్నారు. ఈనెల 26వ తేదీన మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement