మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Nov 25 2026 2:24 AM | Updated on Nov 25 2026 2:24 AM

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి వైభవంగా జ్వాలా తోరణం కరాటే పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ నేడు, రేపు న్యాయవాదుల విధులు బహిష్కరణ

నెహ్రూనగర్‌: విద్యార్థులు నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని గుంటూరు డివిజన్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పెదకాకాని మండలం నంబూరులోని వీవీఐటీ యూనివర్సిటీలో గుంటూరు జిల్లా ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల దుష్ప్రభావాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత మత్తుకు బానిసలైతే వారి జీవితాలతోపాటు కుటుంబాలు కూడా చిన్నాభిన్నమవుతాయని హెచ్చరించారు. అనంతరం జిల్లా ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ అధికారి వి.అరుణకుమారి, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఇ.మారయ్య బాబు మాట్లాడుతూ ఎన్డీపీఎస్‌ చట్టం నిబంధనలు, శిక్షల తీవ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గుంటూరు–1 ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.రవికుమార్‌, సబ్‌ ఇన్‌్‌స్పెక్టర్లు ఎండీ.కె.షరీఫ్‌, పి.తిరుమలేశ్వరరావు, యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మంగళగిరి టౌన్‌: కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలోని శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం జ్వాలా తోరణం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కార్తిక మాసంలో అత్యంత విశిష్టమైన రోజుగా భావించే పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు జ్వాలా తోరణం కిందుగా వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. దీపారాధనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఆర్‌బీ డ్రాగన్స్‌ షోటోకాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆఫ్‌ ఏసీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక టైనీ టాట్స్‌ స్కూలులో గుంటూరు జిల్లా స్థాయి స్కూల్స్‌ కరాటే పోటీలు నిర్వహించారు. వివిధ స్కూల్స్‌ నుంచి సుమారు 70 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్‌ డైరెక్టర్‌ నిమ్మగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఈ క్రీడకు ఎంతో అవసరమని అన్నారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణగా ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్స్‌, మెడల్స్‌ అందించారు. పోటీలకు న్యాయనిర్ణేతగా ఆర్‌బీడీఎస్కే స్టైల్‌ చీఫ్‌ పి.రాంబాబు, ప్రెసిడెంట్‌ జి సాయిరాం, స్కూల్‌ చీఫ్‌ కోచ్‌ రవికుమార్‌, ఉమెన్స్‌ కోచ్‌ ఎ.లక్ష్మీప్రసన్నకుమారి పాల్గొన్నారు.

గుంటూరు లీగల్‌: ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కోర్టుల నిర్వహణపై చేసిన ప్రకటనకు నిరసనగా, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలనే డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు బుధ, గురువారాలలో విధులకు హాజరుకావద్దని గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో న్యాయవాదులకు పిలుపునిచ్చారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలను అరికట్టి, న్యాయవాదుల వృత్తిపరమైన భద్రతకు హామీ కల్పించే అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో న్యాయవాదుల రక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే తరహాలో న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement