నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు

Nov 25 2026 2:24 AM | Updated on Nov 25 2026 2:24 AM

నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు

నగరం: పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. మండలంలోని అద్దంకివారిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 10 పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించి మాట్లాడారు. డిసెంబర్‌ 2వ తేదీన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు పనిచేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. పోలింగ్‌ రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అద్దంకివారిపాలెం గ్రామంలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని ఆర్‌డీవో శ్రీదేవిని ఆదేశించారు. అనంతరం నగరంలోని ఎస్‌వీఆర్‌ఎం కళాశాలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఉన్న ఎన్నికల సామగ్రిని పరిశీలించి, తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డీవో శ్రీదేవి, తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో పోస్టల్‌ ఓటింగ్‌

ఈ నెల 26న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించే వారు మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం ఈ నెల 26న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్నాంవారిపాలెం పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్‌ వెంట ఆర్‌డీవో ఎ. హరికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. హాసిని, డీఆర్‌డీఏ పీడీ బి. సింగయ్య, మున్సిపల్‌ శాఖ డి. కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుర్తింపు కార్డు తప్పనిసరి

ప్రతి ఓటరు తప్పనిసరిగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని బోర్డు రూమ్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ నెల 26న మొదటి విడతలో ఆరు మండలాలకు సంబంధించి నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఆర్డీఓలు, డీఎల్‌డీఓలు, మండలాల ఎంపీడీఓలు, ఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం సాయంత్రం 4 గంటల కల్లా తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది చేరుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రంలో ఏవైనా గొడవలు జరిగితే పీఓలు చర్యలు తీసుకోవాలని, పోలింగ్‌ కేంద్రం బయట గొడవలు జరిగితే సంబంధం లేదని పేర్కొన్నారు. ఇన్‌చార్జి డీఆర్‌వో లవన్న, డీఆర్‌డీఏ పీడీ బి.సింగయ్య, డీటీఓ పరంధామరెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ సత్యనారాయణ, ఎలక్షన్‌ సెక్షన్‌ పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement